రామాయణం మనకు కోపాన్ని ఎలా నిగ్రహించుకోవాలో నేర్పుతుంది....విశ్వామిత్రునికి తపః శక్తి వున్నది...మరి ఆ తపః శక్తితో రాక్షసులను చంపడమో, నశింపచేయడమో చేయవచ్చు గదా! ధశరథుని దగ్గరకు వచ్చి రాముణ్ణి పంపు అని ఎందుకు అడిగాడు..
శాపము ఇవ్వడం అన్నా, ఓక మనిషిని తిట్టడం అన్నా ఓకటే....తన పుణ్యఫలం, తపస్సు కరిగిపోతుంది.......రాక్షసుల మీద దేవతా ప్రయోగములు చేయాలి....దాని వలన తపః ఫలము నశించిపోతుంది. మరలా ఎన్నో సంవత్సరములు తపస్సు జేస్తేగాని శక్తి రాదు...పైగా రాక్షస సంహారం క్షత్రియ ధర్మం...రాజు ధర్మం...సంహరించడం బ్రాహ్మణ ధర్మం కాదు...అందుకని ఉపాసకులు ఇతరులు బాధించినప్పుడు సహించి ఓర్చుకొంటారు...తొందరపడి ఏమీ అనరు...
ఉపాసన చేయగా చేయగా అంతఃకరణం పవిత్రమై, శుద్ధి అయ్యి, సర్వమూ ఆ దేవతగానే దర్శిస్తాడు. తద్ధేవతగా మారుతాడు...తాను వేరు, తాను ఉపాసించే దేవత వేరు అనే భావన వుండదు...అన్ని రూపాలలో కనిపిస్తున్నది తను ఉపాసించిన దేవతే అనుకొంటాడు...అలాగే కనిపిస్తుంది. అటువంటి స్థితిని కల్పించడానికే మంత్ర తంత్రాలు వచ్చినాయి...మంత్రాలు జపిస్తూ తనను తాను మర్చిపోయి తద్దేవతలో కలిసిపోవడమే ఉపాసన...దానికే యోగమని పేరు....
అందుకని విశ్వామిత్రుడు రాముణ్ణి శరణుజొచ్చాడు తన యజ్ఞ నిర్వహణ కొరకు.....అందువల్ల మహర్షి తన కార్యానికి సహాయంగా రాములవారిని పంపవలసినదిగా దశరధ మహారాజుని కోరాడు.
రాముడు చేసిన మొదటి కార్యం ధర్మరక్షణార్ధమై తొలి అడుగు వేసినాడు....
యజ్ఞ రక్షార్ధి అయ్యి వేంచేసిన రాముల వారికి జయ మంగళం పలుకుతూ,
అటువంటి రాముడు మనలను రక్షించుగాక!
శ్రీరామ జయరామ జయ జయ రామా!