శరీరం వదలి ఆత్మ బయటకు వస్తే, చనిపోయిన వాళ్లు అందరూ మోక్షగాములేనా? ఆ ఆత్మకు శరీర స్పృహ లేదుగా, మరి చనిపోయిన వాళ్లు అందరూ జ్ఞానులై మోక్షానికి వెళ్లాలి గదా? అలా జరగడం లేదే?
శోధించి, శోధించి....మనసుతో ఆత్మను పొందాలి....బొందిలో వుండగానే ఆత్మ జ్ఞానం పొందాలి....మనసుతో, బుద్ధితో విచారించి, శరీరాన్ని వేరు చేసి, ఆత్మానుభూతి పొందాలి....మనసు body నుంచి detach కావాలి....అది శరీరం వున్నప్పుడే తెలుస్తుంది....శరీరం లేక పోతే జ్ఞానం లేదు, మోక్షం లేదు.....మనసు ఇంద్రియాలను వదలి, బుద్ధి సహాయముతో ఆత్మను పట్టుకోవాలి.....అప్పుడు నీ లోని నీవు, ఇతరులలోని జీవుడు కనిపిస్తాడు....ప్రాణం చూడవచ్చును.....నీలోని ప్రాణ జ్యోతిని దర్శించవచ్చును.....
ఓ 75 ఏళ్ల ముసలి వాడు చనిపోతే, మనసు ఏ బుద్ధితో వుంటే ఆ బుద్దితోనే ఆత్మ వెళుతుంది...కారణ శరీరంతో బాటు ఆత్మ వెళుతుంది కనుక, మనసు యొక్క చేష్టలను, వాసనలను పట్టుకొని వెళుతుంది.....కాబట్టి ముసలి వాడు చనిపోతే ముసలి ఆత్మ వెళుతుంది....కుర్రవాడు చనిపోతే కుర్ర ఆత్మ వెళుతుంది....ఆత్మకు వయసు నిమిత్తం లేకపోయినా, ఆత్మను ఆవరించిన మనసులో వయసు వున్నది....అందుకే కోరికలు తీరని ఆత్మలు ఇక్కడే తిరుగుతూ వుంటాయి....చనిపోయే ముందు ఏ శరీర ఆకృతిలో వున్నామో, సూక్ష్మ శరీరము అదే ఆకృతిని తీసుకోని గాలిలో లేస్తుంది.....ఆత్మ వేరు కానంతవరకూ, సూక్ష్మ శరీరం తన యొక్క పాత భౌతిక (స్థూల) రూపంలోనే వుంటుంది....ఈ సూక్ష్మ శరీరాన్ని అందరూ చూడలేరు....యోగులు, ఉపాసకులు, జ్ఞానులు మాత్రమే చూడగలరు.....శరీరంతో పూర్తి అనుబంధం తొలిగేంతవరకూ శరీరం చుట్టూ ఆత్మ తన సూక్ష్మ రూపంలో తిరుగుతూ వుంటుంది.....
మీరు వుండే ఇంటిలో మరకలు, బూజు ఎక్కడ వున్నాయో మీరు గమనించరు....అదే వేరే వాళ్ల ఇంట్లో మరకలు ఎక్కడున్నాయో ఇలాగే పట్టేస్తారు.....అలాగే మీ ఇంట్లో బూజు ఎక్కడ వున్నదో మూల మూలల శ్రద్ధగా వెతకండి....కనిపిస్తుంది....పరిశీలనా దృష్టిని అలవర్చుకోండి....ప్రతిదీ అంతర్గతంగా ఆలోచించండి ....మౌనంగా పరిశీలించండి ....మనసును ఏకాగ్రతను చేయండి....ఆత్మలు కనిపిస్తాయి....చూసే శక్తి వస్తుంది మీకు.....మంచి చెడు తెలుస్తుంది.....స్వార్ధం తొలగిపోతుంది .....తప్పు ఓప్పులు కనిపించని స్థితికి చేరిపోతారు.....దానికి సాధన అవసరం....మౌనం, మంత్రం అవసరం......మంత్రం మౌనంలో ఆగిపోవాలి....సూక్ష్మ నాడులలో విలీనమైపోవాలి....
ఆత్మ హృదయంలో వున్నా, సాధన చేత యోగులకు, జ్ఞానులకు ఆత్మ యొక్క శక్తి, చైతన్యం నవ రంధ్రముల ద్వారా బయటకు వెద జల్లు బడుతుంది దాని కాంతి పుంజములు.....ముఖ్యముగా సాధకులు తమ చైతన్యాన్ని ఆజ్ఞా చక్రంలో కేంద్రీకరించి ధ్యానం చేస్తూ వుంటారు గనుక తమ సహస్రారం చుట్టూ కాంతి వలయం ఏర్పడుతుంది.....వెంట్రుకల చివరి నుంచి కాంతి వెదజల్లబడుతూ వుంటుంది ఉపాసకులకు.....
బ్రతికి వున్న శరీరంలో ఆత్మ చైతన్యం హదయంలో వున్నందున వలన అది శరీరం వరకే వ్యాపించి జీవ కళతో వుంటాడు.....అదే చనిపోయే ముందు, ఓక్కో ప్రాణం బయటకు వచ్చేస్తూ వుంటుంది గనుక, శరీరం ప్రేత కళను పొంది, శరీరం పై భాగంలో కాంతి వలయం ఏర్పడుతూ వస్తుంది....చనిపోయే వాళ్లను పరిశీలించి చెబుతున్న మాటలు ఇవి...పూర్తి ప్రాణములు బహిర్గతం అయిన తరువాత శరీరం నల్లబడుతూ, చైతన్య కళ విహీనమై ప్రేత కళను పొందుతుంది.....శరీరం పైన జీవాత్మ యొక్క సూక్ష్మ శరీరంను చూడవచ్చును.....ధూళి లాగ....పొగ మాదిరి....
రెండు రోజుల క్రిందట మా దగ్గరి బంధువుల మరణంలో నేను చూసిన దృశ్యములు...అనుభూతులు.
..............ఆచార్య భాస్కరానంద నాథ/24-07-2016