Friday, 1 July 2022

GLORY OF THE GURU - Ep-05

 

GLORY OF THE GURU

The Infallible Blessing - Ep-05/16-06-2022                                                                                             Source:  GLORY OF THE GURU, Compiled by Smt. S. Vijayalakshmi, Salem                               Telugu Translation by Sri Bhaskarananda Natha   

 

 

During the Chaturmasya of 1987, His Holiness had camped in Madurai near Sri Meenakshi Amman temple. Two days after Guru Poornima, I went with my parents to receive the darshan of Sadguru. His Holiness looked at me and said "As long as Acharyal stays in Madurai, you will have His darshan daily". My residence was at Vasanta Nagar near Palanganatham. As I traveled back home I wondered how I would have the privilege of my Guru's darshan when my home was so far away from the Sri Mutt. Astonishingly, every single evening I received the darshan of His Holiness.

 

Each day some of my friends would accompany me to the Sri Mutt. I realized how time and space were at the command of the infallible blessing of revered Sadguru.

-----------------------------------------------------------------------

అమోఘమైన దీవెన  /Ep-05  /16 -06-2022                                                                                            Source:  Glory of the Guru – Compiled by Smt. S. Vijayalakshmi, Salem

తెలుగు అనువాదము: శ్రీ భాస్కరానంద నాథ / #శిష్యకోటిశృంగేరి

 

1987 చాతుర్మాస్య సమయంలో, పూజ్య జగద్గురువులు శ్రీ మీనాక్షి అమ్మవారి ఆలయానికి సమీపంలో మదురైలో విడిది చేసియున్నారు. గురు పూర్ణిమ వెళ్ళిన రెండు రోజుల తర్వాత, నేను సద్గురువుల దర్శనం కోసం మా తల్లిదండ్రులతో కలిసి వెళ్లాను.  పూజ్య జగద్గురువులు నా వైపు చూసి "ఆచార్యులు మదురైలో ఉన్నంత కాలం, మీకు రోజూ వారి దర్శనం కలుగుతుంది" అని అన్నారు. మేము పలంగనాథం సమీపంలోని వసంత నగర్‌లో ఉండేది. నేను ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు, నా ఇల్లు శ్రీ మఠానికి చాలా దూరంగా ఉన్నది కదా, మరి నాకు గురువుగారి దర్శనం రోజూ ఎలా దొరుకుతుంది? అని నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యకరంగా, ప్రతి రోజు సాయంత్రం నేను వారి దివ్య దర్శనం పొందాను.

 

ప్రతిరోజూ నా స్నేహితులు ఎవరో ఒకరు నాతో పాటు శ్రీ మఠానికి వచ్చేవారు. పూజ్య సద్గురువుల యొక్క అమోఘమైన ఆశీర్వాదం వల్ల నాకు వ్యవధి, ఖాళీ  రెండూ ఎలా దొరికినాయో దొరికినాయి.  సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు.

 

శ్రీ గురో పాహిమాం...పరమ దయాళో పాహిమాం...శృంగేరి జగద్గురో పాహిమాం...శ్రీ భారతీతీర్థ పాహిమాం.. శ్రీ విధుశేఖర భారతీ  పాహిమాం….దాసోహం శృంగగిరి నాథ ...సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.

తెలుగు అనువాదము: శ్రీ భాస్కరానంద నాథ /  #శిష్యకోటిశృంగేరి

#ShishyakotiSringeri / 16-06-2022

For previous episodes, please follow us on

https://www.facebook.com/groups/521228098671530

https://t.me/shishyakotisringeri

https://chat.whatsapp.com/Ll7hW4VCInWAtYJzRCQh4E

https://chat.whatsapp.com/LZI4dZ4Eflo4aO7tFxOLGJ

(దయచేసి పేర్లు, లింకులు తుడపకుండా, వున్నది వున్నట్లుగా షేర్ చేయండి) 

 

GLORY OF THE GURU - 04

 

GLORY OF THE GURU

Miracle of Hot Water Ep-04/14-06-2022                                                                                             Source: Glory of the Guru – Compiled by Smt. S. Vijayalakshmi, Salem                                            Telugu Translation by Sri Bhaskarananda Natha    

 

Miracle of Hot Water

 

His Holiness is the limitless, sublime ocean of mercy. He is the personification of Lord Shiva, the bestower of boons in this Kali Yuga. He watches over His devotees with the tenderness of a mother and protects them. This episode is a drop of nectar drawn from that vast ocean just to sample the rarity and greatness of His Holiness's benevolence.

 

Last year I had been to Sringeri during Chaturmasya and had stayed in a room at 'Shankara Krupa' next to the room of Smt. Ananthalakshmi Ammal. The day was the 13th of August, a Dwadasi day. Rain lashed relentlessly since morning. I wanted to offer Biksha vandhanam to His Holiness but was unable to cross river Tunga due to torrential downpour. The next day, I wanted to leave early to achieve the darshan of His Holiness. It was still raining and the spate in Tunga was rising. At 6 am I brought two buckets out and asked the watchman for hot water. He replied that there was a major power outage and that they were short of water. He added that only when the power.

supply was restored could the water tank be filled and be made available to the residents. He also filled the buckets with rain water for my use.

 

I felt dejected. I had already missed the darshan of His Holiness the previous day and did not want to lose the opportunity today. I contemplated taking bath in the river Tunga. Yet I sought to try the bathroom tap one last time. Speaking to myself audibly, I asked " O Guru! What am I to do today? In this unyielding rain should I bathe in River Tunga?" As I turned the tap, I was speechless to see hot water flowing rapidly from it. None of the other rooms in Shankara Kripa had even cold water supply and my room did not have a water heater either. Yet piping hot water poured out of the tap.

I collected one and half buckets of water. After I bathed I collected another bucket of water. I had also begun heating the rain water on the stove. I offered both water to Sivakumar in the adjoining room and asked him to perform his ablutions without waiting for power supply. I tried opening the tap again and not a drop of water came from it.

 

That evening beset with gratitude, I told my Guru of the divine sequence of events that happened in the morning. With a benevolent smile He replied "When the river was in spate with no sign of abatement from torrential rain, Acharyal cannot approve of your taking bath in river Tunga. Therefore the tap provided hot water".

 

My heart ebbs and flows as I contemplate the motherly kindness with which His Holiness provided hot water to counter the bitter cold weather. I know nothing besides humbly reciting the supreme mantra "Sri Guro Paahimaam".

 

The omnipotent Guru shields His weak devotee from all tribulations. Should difficulty befall His devotees His Holiness who is the cause and effect of everything wards them off and shields His devotee with care.

Telugu Translation by Sri Bhaskarananda Natha  

 

 

వేడి నీటి అద్భుతం /Ep-04 /14 -06-2022                                                                                            Source:  Glory of the Guru – Compiled by Smt. S. Vijayalakshmi, Salem

తెలుగు అనువాదము: శ్రీ భాస్కరానంద నాథ / #శిష్యకోటిశృంగేరి

 

04. వేడి నీటి అద్భుతం

పరమ పూజ్యులైన ఆచార్యులు వారి మనసు అపరిమితమైన, ఉత్కృష్టమైన కరుణా సాగరం లాంటిది.  ఈ కలియుగంలో వరాలను అనుగ్రహించే పరమ శివుని స్వరూపం వారిది.  తల్లి వలే వాత్సల్యం తో లాలిస్తూ తమ భక్తులను రక్షిస్తారు వారు.

 

దృష్టాంతము పరమ పూజ్యులు యొక్క అరుదైన  గొప్పతనాన్ని, మహత్తును మచ్చుకకు  ఒకటి చూపడానికి ఆ మహా సముద్రం నుండి తీయబడిన ఓ అమృతపు బిందువు.

 

గత ఏడాది చాతుర్మాస్య దీక్షా సమయంలో శృంగేరికి వెళ్లి,  'శంకర కృప'లో శ్రీమతి అనంతలక్ష్మి అమ్మాళ్ గారి గది పక్కనే నేను కూడా ఓ గదిలో బస చేశాను.. ఆ రోజు ఆగస్టు 13వ తేదీ, ద్వాదశి తిధి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. నేను శ్రీ గురు చరణులకు  బిక్షావందనం సమర్పించాలనుకున్నాను కానీ కుండపోత వర్షం కారణంగా తుంగా నదిని దాటలేకపోయాను. మరుసటి రోజు, ఆచార్యుల వారి  పవిత్ర దర్శన భాగ్యమును పొందడానికి  త్వరగా బయలుదేరాలని అనుకున్నాను. వర్షం కురుస్తూనే వున్నది, తుంగా ప్రవాహము అంతకంతకూ పెరుగుతూ వున్నది. ఉదయం 6 గంటలకు నేను రెండు బకెట్లు తెచ్చి, వాచ్‌మెన్‌ని వేడి నీళ్ళు అడిగాను. పెద్దఎత్తున విద్యుత్తు అంతరాయం ఏర్పడిందని, దాని వలన నీటి కొరత ఉందని, కరెంటు ఉన్నప్పుడు మాత్రమే వేడి నీళ్ళు లభిస్తాయని అని ఆయన బదులిచ్చారు. నీటి ట్యాంక్‌ను నింపేందుకు విద్యుత్తు సరఫరా పునరుద్ధరించబడాలి. నా అవసర కోసం బకెట్లలో వాన నీటిని కూడా నింపి వుంచినాడు.

 

నాకు చాలా నిరుత్సాహం గా అనిపించింది. నేను నిన్నటి రోజున  శ్రీ గురు చరణుల యొక్క దివ్య దర్శనాన్ని చూడలేకపోయాను మరియు ఈ రోజు ఆ అవకాశాన్ని కోల్పోకూడదనుకున్నాను. తుంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించాలని సంకల్పించినాను. ఎన్నో ఎన్నో అనుకున్నాను, చివరకు ఎంతో నిరాశతో చివరిసారిగా స్నానాల  గదిలో కుళాయిని త్రిప్పి మరో మారు ప్రయత్నించాలని అనుకున్నాను. "ఓ గురూ! ఈరోజు నేనేం చేయాలి? ఈ ఎడతెరిపిలేని వర్షంలో తుంగా నదిలో స్నానం ఎలా చేయాలి?" అని అనుకుంటూ నేను కుళాయిని త్రిప్పినప్పుడు, దాని నుండి వేడి నీరు వేగంగా ప్రవహించడం చూసి నాకు మాటలు రాలేదు. శంకర కృపలోని ఇతర గదుల్లో ఏ గదికి కూడా నీటి సరఫరా లేదు మరియు నా గదిలో వాటర్ హీటర్ కూడా లేదు. కానీ  కుళాయి లోంచి వేడి నీళ్ళు వచ్చినాయి.

 

నేను ఒకటిన్నర బకెట్ల నీటిని పట్టుకున్నాను. నేను స్నానం చేసిన తర్వాత మరో బకెట్ నీటిని పట్టి వుంచాను. అయినా కూడా నేను మరలా పొయ్యి మీద వర్షపు నీటిని వేడి చేయడం ప్రారంభించినాను. ప్రక్క గదిలో ఉన్న శివకుమార్‌ గారికి  రెండు బక్కెట్ల నీళ్ళు అందించి కరెంటు కోసం ఎదురు చూడకుండా స్నానాలు చేయమని అడిగాను. నేను మళ్ళీ కుళాయి త్రిప్పి చూశాను కానీ దాని నుండి ఒక్క చుక్క నీరు రాలేదు. ఏమిటో విచిత్రం.

  

ఆ రోజు సాయంత్రం కృతజ్ఞతా భావంతో, ఉదయం జరిగిన దివ్య సంఘటనలను గురువుగారికి చెప్పాను.

"కుండపోత వర్షం తగ్గుముఖం పట్టకుండా నది ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు, మీరు తుంగా నదిలో స్నానం చేయడాన్ని ఆచార్యులు ఎలా ఆమోదిస్తారు? అందువల్ల కుళాయి వేడి నీటిని అందించింది" అని దయతో కూడిన చిరునవ్వుతో వారు జవాబిచ్చినారు.

 

తీవ్రమైన చలిని ఎదుర్కోవడానికి వేడి నీటిని అందించిన పూజ్య గురు దేవుళ్ళ వాత్సల్యమును గురించి ఆలోచిస్తున్నప్పుడు నా హృదయం ఉప్పొంగి పోయింది. కళ్ళల్లో నీరు తిరిగినాయి వారి మాటలకు. "శ్రీ గురో పాహిమాం" అనే సర్వోన్నత మంత్రాన్ని వినయంగా పఠించడం తప్ప నాకు ఏమి తెలుసు?

 

అన్నింటికీ మూల కారణంబైన, సర్వ  శక్తిమంతుడైన పూజ్య జగద్గురువులు, అత్యల్పుడైన తన భక్తుడిని అన్ని ఆపదల నుంచి, కష్టాల నుంచి దూరంగా ఉంచి, తన భక్తులను కంటికి రెప్పలా జాగ్రత్తగా కాపాడుతారు.

 

శ్రీ గురో పాహిమాం...పరమ దయాళో పాహిమాం...శృంగేరి జగద్గురో పాహిమాం...శ్రీ భారతీతీర్థ పాహిమాం.. శ్రీ విధుశేఖర భారతీ  పాహిమాం….దాసోహం శృంగగిరి నాథ ...సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.

తెలుగు అనువాదము: శ్రీ భాస్కరానంద నాథ /  #శిష్యకోటిశృంగేరి

#ShishyakotiSringeri / 14-06-2022

 

For previous episodes, please follow us on

https://www.facebook.com/groups/521228098671530

https://t.me/shishyakotisringeri

https://chat.whatsapp.com/Ll7hW4VCInWAtYJzRCQh4E

https://chat.whatsapp.com/LZI4dZ4Eflo4aO7tFxOLGJ

(దయచేసి పేర్లు, లింకులు తుడపకుండా, వున్నది వున్నట్లుగా షేర్ చేయండి) 

 

 

 

Thursday, 9 June 2022

GLORY OF THE GURU -Ep-03

 

GLORY OF THE GURU

Guru Mantra, the unfailing companion/Ep-03/06-06-2022

Source: Glory of the Guru – Compiled by Smt. S. Vijayalakshmi, Salem

Telugu Translation by Sri Bhaskarananda Natha  

 

 

My niece Hiranmayee completed B.E. Computer Science and went to pursue Masters at Illinois Institute of Technology, Chicago. When she landed at the O Hare airport, the immigration officer asked her which school she was going to. She replied that she was going to Illinois Institute of Technology in South Chicago. The officer warned, “You should never walk around the neighbourhood alone by yourself.”

 

When she went to the college, Police Authorities met with the students as part of the Orientation program and told them to always be careful. As the University was located near a project area where African American population was concentrated, students were advised to not wander into their area. When confronted by them, the Police Authorities advised students to give up what they asked for and to not convert property damage into personal damage.

 

One day while returning from her class Hiranmayee lost her way and walked right into the project housing area. She had walked several feet inside before she realized that she had headed the wrong way. Her heart leapt to her mouth. There were group of African American people looking inquisitively at the unwelcome stranger. My niece froze in fear. She started to mentally repeat “Sri Guro Paahimaam.” Suddenly an African American approached her rapidly and asked her where she was going. She replied she was going to the student housing in the University campus but had lost her way. He asked her to follow him and lead her back to University campus.

 

The next day she related this to her professors who listened in disbelief. In all their years in the University they had not heard of an incident where those African Americans had actually helped others.

https://chat.whatsapp.com/LZI4dZ4Eflo4aO7tFxOLGJ

--------------------------------------------------------------

గురు మంత్రం, నిజమైన తోడు – 04 /Ep-03 /06 -06-2022                                                                          Source:  Glory of the Guru – Compiled by Smt. S. Vijayalakshmi, Salem

తెలుగు అనువాదము: శ్రీ భాస్కరానంద నాథ / #శిష్యకోటిశృంగేరి

 

నా మేనకోడలు హిరణ్మయి బి.ఇ. కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి,   చికాగో లోని ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (Illinois Institute of Technology) మాస్టర్స్ చదివేందుకు వెళ్ళారు. ఆమె ఓ హరే విమానాశ్రయంలో (O Hare airport) దిగినప్పుడు, ఇమ్మిగ్రేషన్ అధికారి ఆమెను ఏ విద్యా సంస్థ కు  వెళుతున్నారని అడిగారు. దక్షిణ చికాగోలోని ఇల్లినాయిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వెళుతున్నానని ఆమె సమాధానం ఇచ్చింది.

 

"అక్కడ మీరు ఎప్పుడూ ఒంటరిగా తిరగకూడదు."... అని ఆ అధికారి హెచ్చరించాడు,  ఆమె కళాశాలకు వెళ్ళినప్పుడు కూడా, పోలీసు అధికారులు ఓరియంటేషన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను కలుసుకొని, ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

 

ఆఫ్రికన్ అమెరికన్లు  ఎక్కువగా  ఉన్న ఒక ప్రాజెక్ట్ ప్రాంతానికి సమీపంలో ఆ విశ్వవిద్యాలయం ఉన్నందున, ఆ ప్రాంతాలలో తిరగకూడదని విద్యార్థులకు పోలీసు అధికారులు సలహా ఇచ్చినారు. ఒకవేళ అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వారు ఏది అడిగితే అది ఇచ్చేసి తప్పించుకోవాలని, ఆస్తి నష్టాన్ని వ్యక్తిగత నష్టంగా మార్చుకోవద్దని విద్యార్థులకు అధికారులు సూచించారు. 

 

ఒక రోజు తన తరగతి నుండి తిరిగి వచ్చేటప్పుడు హిరణ్మయి తాను దారి తప్పి ప్రాజెక్ట్ హౌసింగ్ ప్రాంతంలోకి  నడిచారు. ఆమె దారి తప్పి తప్పు మార్గంలోకి నడుస్తున్నాను అని  గ్రహించేలోపే ఆమె చాలా దూరం లోపలికి నడిచేసింది. ఒక్కసారిగా ఆమె గుండె జారిపోయినది భయంతో. అక్కడ ఒక ఆఫ్రికన్ అమెరికన్ ప్రజల గుంపు ఆమె పై  ఆరా తీస్తూ వుండడం కనిపించింది. నా మేనకోడలు భయంతో స్తంబించి పోయినది.    

 

ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆమె వెంటనే "శ్రీ గురో పాహిమాం”   అని అంటూ మనస్సులో  స్మరించడం  ప్రారంభించింది. ఇంతలో అకస్మాత్తుగా ఒక ఆఫ్రికన్ అమెరికన్ ఆమె దగ్గరకు వచ్చి, “ఎక్కడికి వెళుతున్నావని” అడిగాడు. ఆమె విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని విద్యార్థి వసతి గృహాలకు(హాస్టల్)   వెళుతున్నానని, కానీ దారిలో మార్గం తప్పిపోయాను అని ఆమె సమాధానం ఇచ్చింది.  తనను అనుసరించాలని మరియు ఆమెను తిరిగి విశ్వవిద్యాలయ ప్రాంగణానికి దారి చూపమని ఆమెను వెంటబెట్టుకొని  సురక్షితముగా బయలుదేరినారు ఆ ఆఫ్రికన్ అమెరికన్.

 

మరుసటి రోజు ఆమె తన ప్రొఫెసర్లతో జరిగిన సంఘటన గురించి చెప్పినది.  కానీ వారు నమ్మలేదు.   తాము ఇప్పటివరకూ ఈ విశ్వవిద్యాలయంలో, ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ ఆ ఆఫ్రికన్ అమెరికన్లు ఇతరులకు సహాయం చేసిన సంఘటన గురించి వినలేదు, చూడలేదు  అని వారు అన్నారు. 

 

శ్రీ గురో పాహిమాం...పరమ దయాళో పాహిమాం...శృంగేరి జగద్గురో పాహిమాం...శ్రీ భారతీతీర్థ పాహిమాం.. శ్రీ విధుశేఖర భారతీ  పాహిమాం….దాసోహం శృంగగిరి నాథ ...సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.

తెలుగు అనువాదము: శ్రీ భాస్కరానంద నాథ /  #శిష్యకోటిశృంగేరి

#ShishyakotiSringeri / 06-06-2022

For previous episodes, please follow us on

https://www.facebook.com/groups/521228098671530

https://t.me/shishyakotisringeri

https://chat.whatsapp.com/Ll7hW4VCInWAtYJzRCQh4E

https://chat.whatsapp.com/LZI4dZ4Eflo4aO7tFxOLGJ

(దయచేసి పేర్లు, లింకులు తుడపకుండా, వున్నది వున్నట్లుగా షేర్ చేయండి)