భాస్కరానంద నాథుడు ఉగాది నాడు "ఆచార్యుడు" అగు శుభ ముహుర్తం వేళ, గురు పాద సన్నిధిలోన...బెంగుళూర్ లోన.....నా అదృష్టం ...మహా భాగ్యం...మహా ప్రసాదం....మంత్ర శాస్త్రములో, శ్రీవిద్యలో ఆచార్య దీక్షను, ఆచార్య బిరుదును మా గురువు గారు ప్రసాదిస్తున్నారు నాకు....
ఇది నేను 2000 సంవత్సరంలో, పూర్ణ దీక్ష ఇచ్చిన జ్ఞానంతో శ్రీశైలం లో తపస్సు చేసినప్పుడు అమ్మ వారు తన చనుబాలు ఇచ్చి నన్ను ఆశీర్వదించినది......ఆ తల్లిని నేను నా కనులారా గాంచినాను....ఆమె ఓళ్లోకి పోతూనే నే నెలల పాపను అయ్యాను, కానీ నాకు సృహ వున్నది నేను రామచంద్రరావును, భాస్కరానంద నాథను అని....నా తల్లి పాలు, జగన్మాత పాలు చక్కగా తృప్తిగా తాగాను,సమాధి ముద్రలో ఎన్నో అత్భుత దృశ్యం ములను నాకు చూపించినది....మెదడులో ఆజ్ఞా చక్రమునందు ఎన్నో చిత్ర విచిత్ర జ్యోతులు రేఖలు కనపడినాయి, సృష్టి రహస్యాన్ని, మహా విలయాన్ని చూపించినది....నా అనుభూతుల సంకలనమే ఈ భావనాగమ్యా ....నన్ను నేను మరిచి పోయి మహా జ్ఞానముతో వ్రాశినది....నా కంటి ముందు కనిపించిన అత్బుతములను, అనుభూతులను అక్షర రూపములో పెట్టాను....అమ్మ నన్ను తన ప్రియ పుత్రుని గా స్వీకరించిన రోజు అది....నా జీవితం ధన్యమైన రోజు ఆ రోజు....
..ఈ రోజు మా గురువులు ఫోను చేసి నన్ను బెంగుళూరు రమ్మన్నారు.....ఆచార్య దీక్ష ఇవ్వడానికి......మహా ప్రసాదంగా భావించి ఉగాదికి బయలుదేరుతున్నాను...అందువలన ఈ రహస్యాన్ని 16 సంత్సరాల తరువాత ఈ శుభ సందర్భములో మీతో పంచుకొన్నాను.......ఆచార్య పట్టాభిషేక మహోత్సవ శుభ సందర్భమున....
గురువుల అనుగ్రహం కలగడం అంటే సాక్షాత్తు ఆ జగన్మాత కృపాకటాక్షములు కలగడం....వారి శిష్యులలో మొట్టమొదటగా ఈ దీక్ష ఇవ్వడం, దానికి నన్ను ఎంపిక చేయడం నా పూర్వజన్మ సుకృతం, గురుదేవుల అపార అనుగ్రహం నా పైన ప్రసరించడం....నా జన్మ ధన్యమైనది.....వారి ప్రేమానురాగాలను చూరగొనడం నా అదృష్టం గా భావిస్తున్నాను.....
ఉదయం 5 గంలకు జపం మొదలు పెడితే సాయంత్రం 6 గంలదాక మహా షోడశీ మంత్రం చేశాను అలా 40 రోజులు....41 వరోజు పై దృశ్యములన్నీ కనిపించినాయు...శ్రీశైలంలో స్వామి వారి గుడిలో లోపల ప్రాంగణంలో మరో చిన్న గుడులు వుండేవి....వాటిల్లో ఓకటి అర్థనారీశ్వర స్వామి గుడి ...అక్కడ కూర్చోని జపం చేశాను....లోపలకి ఎవ్వరూ జనాలు రారు ప్రశాంతంగా వుంటుంది....నన్ను దీవించి పంపించినది అమ్మ....అందుకే మా వాళ్లు నన్ను దేవీ పుత్రుడని, ఏమాట అన్నా అట్లే జరిగిపోతుందని అంటువుంటారు....ఇది నిజం....నాకు ముందుగానే కొన్ని తెలుస్తూ వుంటాయి....ఎవరు చనిపోతారో ముందుగా తెలుస్తుంది....అలాగే నేను మనసు వికలంతో గట్టిగా బాధపడితే 6, 7 మంది చనిపోయినారు కూడా....అందుకే మాట జారకుండా తగు జాగ్రత్తలో వుంటాను....ఈ విషయాన్ని ఇప్పటివరకూ ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు.....ఈరోజు మా గురువులు పిలిచి ఉగాదినాడు నాకు నాకొక్కడికి " ఆచార్య దీక్ష" ఇస్తానని కబురు పంపినాడు.....మహా ప్రసాదంగా భావించి 8 వ తేదీ బెంగుళూరు బయలుదేరుతున్నాను....
One day, UGADI DAY....ఇంతకు ముందు మీరు వెళ్లినారు కదా శ్రీనివాస్ గారింటికి, అక్కడకి మా గురువు గారు వేంచేసి యున్నారు....ఇంతకముందే ఫోను చేశారు....వారి శిష్యుల అందరిలో నన్ను గుర్తించి ప్రధమముగా " ఆచార్య" పదవిని దీక్షను నాకు ప్రసాదించు చున్నారు....ఇది నాకు మహా ప్రసాదము....
భాస్కరానంద నాథుడు ఉగాది నాడు "ఆచార్యుడు" అగు శుభ ముహుర్తం వేళ, గురు పాద సన్నిధిలోన...బెంగుళూర్ లోన.....నా అదృష్టం ...మహా భాగ్యం...మహా ప్రసాదం....మంత్ర శాస్త్రములో, శ్రీ విద్యలో ఆచార్య దీక్షను, బిరుదును మా గురువు గారు ప్రసాదిస్తున్నారు....
శ్రీవిద్యలో ఓక్కో మహా మంత్రం, ఓక్కో శక్తి, ఓక్కో పరంపర....ఓక్కో గురువు ఇలా కొనసాగుతూ వుంటుంది....ఈ మంత్రములన్నీ మోక్ష సాధకమైన మంత్రములు....శ్రీవిద్య అనేది ఓక ప్రత్యేకమైన పరంపర అనాదిగా యుగముల కాలం నుంచి సాగుతూ వున్నది....అయితే గురు సాంప్రదాయ భేదములు కలవు.....నాలుగు ఆమ్నాయ మంత్రములన్నీ చెబుతూ వెళతారు....వైదికమైన సాంప్రదాయంలో, వైదిక కులంలో పుట్టిన వారి చేత అనుష్ఠింపబడుతూ, ఆచరింపబడుతూ అనాదిగా, గురు- శిష్య పరంపరంగా ఈ విద్య, ఈశ్వరుడు పార్వతికి చెప్పగా మొదలయై, ఆది శంకరాచార్యుల ద్వారా మన గురువుల వరకు వచ్చి, మన తరువాతి తరం వారికి శిష్యులకు ఉపదేశం ద్వారా ఈ జ్ఞాన గంగ చెప్పబడుచున్నది....
ఈ విద్య బాల, నవాక్షరి, పంచదశి, షోడశి, మహా షోడశి, మహా పాదుకలు....గా చెప్పబడుచున్నది....మహా పాదుకలు వరకు చెప్పబడిన విద్యను పూర్ణ దీక్ష అని చెప్పెదరు....మహా పాదుకలు సహిత పూర్ణ దీక్ష అని.... మహా పాదుకలు అంటే సన్యాసాశ్రమ దీక్షలో ఇవ్వబడే నాలుగు మహా వాక్యములు....నాలుగు వేదములనుంచి నాలుగు మహా వాక్యములు ఉపదేశించెదరు.....అందువలన ఇది పూర్ణ దీక్ష అయినది.....పూర్ణ దీక్ష అర్హత కలిగిన వారికి "వనదుర్గ మహా విద్య" అని 500 మంత్రములను ఉపదేశిస్తారు.....ఈ దీక్షలో అన్ని దేవతల మహా మంత్రములను ఉపదేశిస్తారు....
దీని తరువాత " ఆచార్య దీక్ష"...ఇవ్వబడుతుంది .....ఈ దీక్షలన్నీ గురు త్రయం ద్వారా చెప్పబడుచున్నవి.....అర్హత లేని వారికి ఈ విద్యలు చెప్పకూడదు .....పంచదశి అర్హత వున్న వారు మాత్రమే శ్రీచక్రార్చన చేయవలయును.....నవాక్షరి అర్హత వున్న వాళ్లు మాత్రమే చండీ సప్తశతి, దుర్గా సప్తశతి చేయవలయును.....ఆడవాళ్లకు షోడశి వరకే చెప్పెదరు, పూర్ణదీక్ష అర్హత లేదు.....ఇది క్లుప్తంగా .....ఆచార్య దీక్ష గురించి రేపు వ్రాస్తాను....సప్తకోటి మహా మంత్రములకు, నాలుగు ఆమ్నాయములకు అధిష్ఠాన దేవతయైన ఆ మహామాయను ఉపాసించడం అంటే మాటలా? ఆమెను ఉపాసించడం అంటే అన్ని దేవతలను ఉపాసించడమే.....సమస్త దేవతల బీజాక్షరములు ఇందులో అనుష్ఠింప బడుతాయి....ఇది లౌకిక విద్య కాదు, వ్యాపారమునకు ఉపయోగించకూడదు .....శ్రీచక్రమును— శ్రీవిద్యను బజారులో పెట్టి అమ్మకండి....శ్రద్ధగలవారు, పట్టుదల గలవారు, ఆసక్తి వున్నవారు ఉపాసనా మార్గములో గురువుల వద్ద నేర్చుకోండి....కొని ఇంట్లో పెట్టుకోవద్దు....వ్యాపారములాగ చేసే వాళ్లను నమ్మకండి, మోసపోవద్దు ....ఎవరు ఇచ్చినా ఏ యంత్రములను తీసుకోవద్దు.....యంత్రము వుంటే మంత్రము, తంత్రము తెలిసి వుండాలి....మంత్రముతో రోజూ పూజాదికాలు చేస్తూ వుండాలి....అంటు తగలకూడదు ....పవిత్రత చాలా ముఖ్యం...
.....భాస్కరానంద నాథ/02-04-2016...
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.