Wednesday, 31 July 2013

About Bhaskarananda Natha...(SELF)


స్వపరిచయం

చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు
ఆంగీరస, భారహస్పత్య, భారద్వాజస త్రయా ఋషయ
ప్రవరాన్విత భారద్వాజస గోత్రః, ఆపస్తంభ సూత్రః,
యజుశ్శాఖాధ్యాయీ, రామచంద్ర శర్మా౦ అహంభో అభివాదయే.

నేను కామరాజుగడ్డ రామచంద్రరావును, భారద్వాజస గోత్రీకుడను, ఆరువేల నియోగి బ్రాహ్మణుడను. మేము స్మార్తులము

1982 లో నా జాతకము గురించి తెలుసుకొనే దానికి, నెల్లూరు లోని ప్రఖ్యాత జ్యోతిష పండితులు, శ్రీవిద్యోపాసకులు, సంస్కృత పండితులు అయిన శ్రీ కొట్రా వెంకట శేషయ్య శాస్త్రి గారి దగ్గరకు వెళ్ళినాను. వారు నా జాతకమును చూసి ఫలితములు చెప్పకుండా నన్ను ఆరు నెలలు తిప్పించుకొని, ఆపైన నాకు శ్రీవిద్యా మంత్రములైన బాల, నవాక్షరి, బగళ మంత్రములు ఇచ్చి నన్ను ఆశీర్వదించి పంపినారు.  అజ్ఞానాంధకారంలో కొట్టుకొని పోవుచున్న నాకు శ్రీవిద్యను అనుగ్రహించి, ఉపదేశించి వెలుగును చూపిన మహనీయులు  వారు. శ్రీవిద్య, శ్రీమాత అంటే ఏమిటో తెలియని నాకు జ్ఞాన బిక్ష పెట్టిన మహా మనిషి  శ్రీ కొట్రా వెంకటశేషయ్య శాస్త్రి గారు. అప్పటి నా వయస్సు 21 సంలు .. గురువులు ఇచ్చిన మంత్రములను జగన్మాత ఆజ్ఞగా భావించి, ఆమె అనుజ్ఞ లేనిదే శ్రీవిద్య లబించదని భావించి భక్తితో, నమ్మకముతో అక్షర లక్షలు జపము చేసిన వాడను. ఇది నా పూర్వ జన్మ సుకృతం. ఎన్నో పరీక్షలు, గురువుల దయతో ఒక్కోటి ఒక్కోటి దాటుకొని ముందుకు నడుస్తూ వస్తున్న వాడను.

అదే మొదలు నేను శ్రీ విద్యలోకి అడుగు పెట్టడము. నా తొలి గురువు వారె. ఆ పైన నేను శ్రీ విద్యోపాసన చేస్తూ, నవరాత్రులు ఆ తల్లిని తొమ్మిది రోజులు శ్రద్దగా పూజిస్తూ వస్తున్నవాడను. ఆరు సంవత్సరాల తరువాత మా గురువు గారు పరమ పదించినారు. గురువు లేని వాణ్ణి అయినాను, దిక్కు లేదు, దారి చూపే వాడు లేడు. గమ్యం అర్ధము కాలేదు. తల్లి కాళ్ళు పట్టుకొని ఎడ్చినాను మరలా గురువును చూపించమని, ఎన్నో రాత్రుళ్ళు నిద్ర లేకుండా వగచాను. 12 ఏళ్లు  గురువు గారు లేకుండా, తండ్రి లేని పిల్లవాణ్ణిగా, లలితా సహస్రనామములతో కాగితపు  శ్రీ చక్రము మీద పూజ చేస్తూ, 12 నవరాత్రుళ్ళు పూర్తి చేసినాను. నవరాత్రి పూజా మహిమ వృద్దా పోలేదు, ఆ తల్లి నన్ను కరుణించినది.  2000 సం. లో తెనాలి వాస్తవ్యులు బ్రహ్మశ్రీ వేమూరి లక్ష్మీనారాయణ  గారు నా శ్రద్దను, భక్తిని చూచి నాకు ఒకే సారి పంచదశి, షోడశి, మహా పాదుకలతో పూర్ణ దీక్ష  ఇచ్చినారు..   మా గురువులు నాకు ఇచ్చిన దీక్షా నామము భాస్కరానంద నాధ.   

 ఆ పైన వారు నాకు మహా విద్యను(500 మంత్రములు) కూడా ఉపదేశించినారు.  వారి దగ్గర మంత్ర, తంత్ర, యంత్ర  శాస్త్రములను,  శ్రీ చక్రార్చన మొదలగునవి నేర్చుకొన్నాను. అటు పిమ్మట ఎన్నో తంత్ర, మంత్ర గ్రంధములను (సంస్కృత)  కాశీ చౌకాంబా సెంటరు నుంచి తెప్పించి,  పరిశోధించి, సాధన చేసి ఎన్నో విషయములను తెలుసుకొన్నవాడను,.
ఫ శ్రీశైలం దేవాలయం లో తపస్సు చేసి, అమ్మ అనుగ్రహమును, దీవెనలను పూర్తిగా పొందినవాడను.
ఎన్నో మంత్రములను స్వయముగా సిద్ది పొంది, తద్దేవతల అనుగ్రహమును పూర్తిగా  
పొందినవాడను. 

ఇప్పటి వరకు వృత్తిలో గాని, ప్రవృత్తిలో గాని ధనాపేక్ష లేకుండా, పై సంపాదన లేకుండా, న్యాయముగా, ధర్మముగా అమ్మ ఇచ్చిన జీతము డబ్బులతోనే బ్రతుకుతున్న వాడను. 

నాకు ఏ పీఠములు లేవు,  శిష్యగణము అంత కన్నా లేదు. అటువంటి ఆశ, ఆలోచన ఎన్నటికీ లేదు. శ్రీవిద్యను అమ్ముకొనే అధముడను కానే కాను. పేరు ప్రతిష్టల కోసం కాదు. ఖాళీ సమయము లలో నేను తెలుసుకొన్న విషయములను గ్రంధస్థం చేయు చున్నాను. పూర్తిగా ఇది నిస్వార్ధ మైన సేవ. 

మోక్ష సాధన కొరకు, ఆత్మ జ్ఞానము కొరకు మాత్రమే ఈ శ్రివిద్యను వినియోగిస్తు వస్తున్న వాడను. ఆ రకముగా మా గురువుల వద్ద ప్రమాణము చేసి వున్న వాడను.  30 ఏండ్ల సాధనతో ముందుకు నడుస్తున్న వాడను.  ఇప్పటి వరకు ఎవ్వరికీ ఏ  అపకారము తలపెట్ట లేదు. నా ఆత్మ ఉన్నతి కొరకు మాత్రమే  ఈ శ్రీవిద్య ను ఉపయోగిస్తూ వస్తున్న వాడను. 

ఇది కేవలము నా ఆత్మ ఉన్నతి , ఉద్దతి కొరకు మాత్రమే గాని ఇతరులకు ఉపదేశము చేయుటకు కాదు. జ్ఞాన సముపార్జన కొరకు మాత్రమే.  

నేను గురువును కాను, జ్ఞానిని, సాధువును, సన్యాసిని  కాను. యోగి ని గాను, పీఠాధిపతిని కానే కాను.

ఒక మామూలు గృహస్థుడను, ఒక సాధకుడను, ఒక ఉపాసకుడను మాత్రమే.

శ్రీ శృంగేరీ శ్రీ విరూపాక్ష శ్రీ పీఠాధీశ్వర
శ్రీవిద్యాశంకర పదమావేశ ప్రకాశిత
శ్రీ జగద్గురు శ్రీ శ్రీ శ్రీ కల్యాణానంద భారతీ మహాస్వామి (శ్రీ విద్యారణ్యుల వారి అవిచ్చిన్న గురుపరంపరలో 42వ జగద్గురు) వారు మా పరమేష్టి  గురువులు.  స్వచ్చమైన గురుపరంపరలో వస్తున్నవాడను.

కావున నేను శ్రీ శృంగేరీ శంకరాచార్య సాంప్రదాయములోని వాడను. నమ్మినవాడను. ఆ పరంపరలో దీక్ష తీసుకున్నవాడను.   స్మార్తులము మేము. సకల దేవతారాధనే మా మతము. శివునికి విష్ణువుకి అభేదము అని గాఢముగా, ధృఢముగా నమ్మే వాళ్ళము మేము.

జగద్గురువులు శ్రీ శంకరాచార్య భగవత్పాదులు మా గురువరేణ్యులు. ఆదిగురువులు. వారి పరంపరలో వస్తున్న వాడను, వారి మాటలు నాకు శిరోధార్యము. వారి మాటలను, వారి సిద్దాంతములను, వారి అడుగుజాడలలో నడవడము నా ప్రధమ కర్తవ్యము అయివున్నది. జగద్గురువులు ఆది శంకరాచార్యల పరంపర మాది. ఇది మా గురు పరం పర.


నాకు తెలిసిన, నేర్చుకున్న విషయములను పదిమందితో పంచుకోవాలన్న సత్ సంకల్పముతో ముందుకు సాగుతున్నాను.


  గురువుల ఆజ్ఞ మేరకు, శ్రీవిద్యావ్యాప్తి కొరకు నా వంతు సహాయమును చేస్తున్నాను. జగములకు తల్లి అయిన ఆ శ్రీమాతను గురించి నాకు తెలిసిన, నేను తెలుసుకొన్న నాలుగు మాటలు ఇతరులకు చెబుతున్నాను.

 ఇష్టము వున్నవాళ్ళు స్వీకరించ వచ్చును, ఇష్టము లేని వాళ్ళు త్రుణీకరించనూ వచ్చును. ఎవరి అభిమతము వారిది. తెలిసినది కొంతే అయినా, తెలియనిది చాలా వున్నది.

 ఓం శాంతి: శాంతి: శాంతి:.

మీ
భాస్కరానంద నాథ /05-04-2012

మహాపాదుకాంత శ్రీవిద్యాపూర్ణ దీక్షాపరులు
(కామరాజుగడ్డ రామచంద్రరావు )

Monday, 29 July 2013

మహాకాళీ సాధన - 3


మహాకాళీ సాధన
దశ మహా విద్యలు - శ్యామా కాళీ-3

ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ పురుషార్ధ ఫల సిధ్యర్ధం, మనో వాంఛా పరి పూర్ణార్ధం, ఉత్తరోత్తర జన్మ ప్రాప్యర్ధము, సకలైశ్వర్య సత్సంతానా వ్యాప్త్యర్ధము, ఆయురారోగ్య, సుఖ వైభవ  ప్రాప్యర్ధ౦, జనులు దేవతల యొక్క ఉపాసనా పరులౌతారు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. త్రిమూర్తులు జగత్ సృష్టి, పాలన, సంహార కర్తవ్యములను నిర్వర్తించ కలగడానికి పరాశాక్తియే కారణము. వారికా శక్తులను నిచ్చినది ఆ పరాశక్తియే. అయితే ఈ శక్తి స్త్రీ లింగమా లేక పుం లింగమా, నపుంసక లింగమా అని ఆలోచిస్తే, ఈ వివక్షతలు ఏవీ లేని పరాశాక్తియే అని దేవీ భాగవతం చెబుతుంది. ఉన్నది ఒక్కటే. అదే రెండుగా కనిపిస్తుంది. అదే పర బ్రహ్మం, అదే పరాశక్తి. అదే బిందు స్వరూపం. అదే కామేశ్వరాంకస్థ నిలయా. ఆమె లోనే ఆయిన వున్నాడు. ఆయిన లోనే ఆమె వున్నది. శివ శివాని ఒక్కరే. చూచే వారిదే బేధము.

మహాకాలుడు, మహా కాళి ఒక్కరే. నీకు ఇష్టమైన రూపములో నీవు చూడవచ్చు.  మహాకాలుని విలయతాండవమే మహా కాళి. కాలమే మహా కాళి. శరీరములో ప్రతి కణం ప్రతి క్షణం చస్తూ, బ్రతుకుతూ వుంటుంది. అదే మహా కాలుని విలయ తాండవము.                   అదే మహాకాళి కరాళ నృత్యం. ప్రపంచాన్ని దాని పరిమాణాన్ని శాసించే మహా శక్తియే మహా కాళి. అంతమే ఆదికి మూలం. తరగడమే పెరగడానికి నాంది. ప్రళయమే సృష్టికి నాంది. కాళిమాత ప్రాణ క్షేత్రం, చేతనా క్షేత్రం, ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులకు కేంద్రం. ఆమె ఈ సృష్టికి గర్భ కోశం. ఈ బ్రహ్మాండమే ఆమె యోని. ఆమెయే మన అందరికీ తల్లి.

కావ్యకంఠ శ్రీ గణపతి ముని వర్యులు ఈ మహా కాళీని పరిణామ శక్తిగాను, విద్యుచ్చక్తిగాను, స్త్రీ లింగ రూపమైన కాల శక్తిగాను, తాండవ రూప మెత్తిన కాలపాకజ క్రియాశాక్తిగాను, అండా౦డ పిండాండ బ్రహ్మాండాల సంహార శక్తి గాను, సృజనాశక్తిగాను, ప్రాణ శక్తిగాను, ఉచ్చ్వాస నిశ్వాసాలను నియత్రించే రసజ్ఞా బీజంగాను, జీవ శక్తిగాను, చేతనా శక్తిగాను, ఆమె ఖడ్గం సంసార జీవితమును ప్రహరణ చేసే తాడన శక్తిగాను, మాహాకాలుని నాట్యకళగాను, యోగులకు హస్త స్వాధీనమైన ముక్తి ఖడ్గంగాను అభి వర్ణించినారు.

ఎకమేవా ద్వీతీయం బ్రహ్మ నిత్యం సనాతనం. ద్వైత భావం పునర్యాతి కాల ఉత్సిత్సు సంజ్ఞకే.

సదైకత్వం నభేదోzస్తి సర్వ దైవ మమాస్యచ, సోzసౌ సాహమహం యోzసౌ భేదోzస్తి మతి విభ్రమం.  

“ నేనూ అతడూ ఒకరమే, మాకు భేదాలు లేవు. నేనే పురుషుడు, నేనే స్త్రీ ని. అజ్ఞానం వలెనే భేద భావం కలుగుతుంది. అత్యంత సూక్షమైన మా అంతరాన్ని లోక బంధాల నుండి విముక్తులైన బుద్ధి మంతులే గుర్తించ గలరు. ఇందుకు సందేహము లేదు. సృష్టి కాలములో బ్రహ్మము ఏకముగా, అద్వితీయముగా, సనాతమైనదిగా వుండేది. సృష్టి కార్య నిమిత్తము నేనే రెండుగా గోచరింప బడుతాను. ఉపాధి భేదం వలన ఒక దీపం బహు దీపాలైనట్లు, మాయా ప్రభావం వలన అద్దంలో ప్రతిబింబం భిన్నముగా కనిపించి నట్లు, నీడ వేరుగా కనిపించి నట్లు ద్వైత భావం ఉదయిస్తుంది. అజాయమానుడే బహుధాత్వాన్ని ప్రదర్శిస్తాడు. సృష్టి నిమిత్తకారణముగా నేనే బహు విధములుగా కనిపిస్తాను. కానీ వున్నది ఒక్కటే.”

“శక్తి జ్ఞానం వినాదేవి ముక్తి: హాస్యాయ కల్పతే”

ఉపాసన అంతా ఈ అద్వితీయ శక్తికే జరుగ వలసి వుంటుంది. కాబట్టి శ్రీ చక్రములోని బిందువు అటు పురుషుడు కాడు, ఇటు స్త్రీ కూడా కాదు, కానీ రెండూ అదే. అయ్యలో అమ్మ, అమ్మలో అయ్య వున్నారు. అయ్య యొక్క శక్తి అమ్మ. బిడ్డ పుట్టితే గానీ స్త్రీ, (ప్రకృతి) తల్లి కానేరదు, తల్లి ఉంటేనే కాని బిడ్డ పుట్టదు. ఈ మర్మము అర్ధం చేసుకోన్నవాడే సాధకుడు, ఉపాసకుడు. సృష్టి యొక్క మూల సూత్రం ఇదే. కనుక తంత్ర సాధన ఉపాసన అంతా స్త్రీ మూర్తికే జరుగుతుంది. ప్రకృతి లోని అఖండ భౌతిక శక్తుల పరిణామం, విద్య, అవిద్య అన్నింటికీ అతీతమైన మాహా స్థానాన్ని మన: పరిధుల్లో మనస్సు ప్రయాణం చేసే మార్గం అది. అదే ప్రకృతిని మాతృమూర్తిగా అర్ధం చేసుకొనే పద్ధతి. అదే మహా విద్య. మహావిద్యోపాసకులకు  మంత్ర, తంత్రములు అన్నీ మనసులోనే జరిగి పోతూ వుంటాయి. అదే అంతర్యాగము.  ఇక వారికి భాహ్య పూజలు అక్కర్లేదు. ఆ అమ్మ వారితోనే తిరుగాడుతూ వుంటుంది. వారి మనసులోనే వుంటుంది. అమ్మకి, వారికీ అభేదము.

పర బ్రహ్మానికి మాయ అనే ముసుగు వేస్తే పరాశక్తి, ముసుగు తీసేస్తే పరాశివుడు. అదే మూలం. అదే చిదంబర రహస్యం. అటువంటి మహా కాళి యొక్క ఉపాసన చాలా సులభము. మనలోని తమో గుణాన్ని, అహంకారమును పారద్రోలే మహా తల్లి. అహంకారమును ఆమెకు బలి ఇస్తే తక్షణమే ప్రసన్నమౌతుంది.  మనలోని రాక్షసులను, అసురీ గుణములను  సంహరించే మహా కాళి ఆమె. ఈ సృష్టికి మూలం ఆమె. అందరికీ మాతృమూర్తి.

ధ్యాన శ్లోకం.

మహా కాళీ ధ్యానం

శవారూఢా౦ మహాభీమాం  ఘోర దంష్ట్రా౦ వర ప్రదాం

హాస్య యుక్తా౦ త్రినేత్రా౦చ కపాల కర్ర్తికా కారా౦

ముక్త కేశీ౦ లలజ్జిహ్వ౦ పిబంతీం రుధిరం ముహు:

చతుర్బాహు యుతాం దేవీం వరాభయ కరాం స్మరేత్||

 

శవారూఢా౦ మహాభీమాం  ఘోర దంష్ట్రా౦ హసన్ముఖీ౦

చతుర్భుజాం ఖడ్గముండ వరాభయ కరాం శివాం

ముండ మాలాధరాం దేవీం లలజ్జిహ్వాం దిగంబరాం

ఏవం సంచింతయేత్కాళీ౦ శ్మశానాలయ వాసినీం ||

జప మంత్రము :-

౧. ఓం క్రీ౦ క్రీ౦ క్రీ౦  xxxxx xxxxx xxxx xxxx xxxx xxxx   స్వాహా. (సిద్ధ మంత్రము)

౨. అధర్వణ భద్ర కాళీ మంత్రము ...xxxx xxxx xxxx xxxx xxxx

౩. మహా కాళీ మంత్రము ... xxxx xxxx xxxxx xxxxxx

౪. క్రీ౦ క్రియా బీజం. కాళీ బీజం.

మహా కాళీ ఉపాసన:-

చండీ నవాక్షరీ మంత్రం సిద్ది పొందిన వారు, కాళీ మాత పూజకు, ఉపాసనకు అర్హులు. ఆతల్లి యొక్క శక్తిని  తట్టుకోగలరు.

పూర్తి మంత్రము సద్గురువుల వద్ద నుంచి ఉపదేశముగా పొంది ఉపాసన చేయవలెను.

మహావిద్య అయిన శ్రీ మహాకాళీ తంత్రములో షుమారుగా 257 మంత్రములు వివిధ ధ్యాన శ్లోకములతో  చెప్పబడినవి. కానీ గురు పరంపరలో సిద్ధ గురువులు చెప్పబడినదే మూల మంత్రము. పై ఈ మంత్రమును శ్రీరామకృష్ణులు వారు ఆచరించి సిద్ది పొందినారు. శ్రీవిద్యా సాంప్రదాయములో  పూర్ణ దీక్షాపరులకు మాత్రమే ఈ మంత్రము చెప్పబడుతుంది.   మహావిద్య ఉపాసన గలిగిన వారికి ఈ మహాకాళి సాధన బహు శీఘ్రముగా ఫలించును. అమ్మ దర్శనం లభించును. వారి వారి మానసిక పరిస్థితులను బట్టి అమ్మ వివిధ రూపాలలో కనిపించును.

మహావిద్య ఉపాసన గలిగిన వారు మాత్రమె ఈ దశ మహావిద్యల ఉపాసనకు అర్హులు. అర్హత అనుసరించి సద్గురువుల వద్ద విధి విధానములను, సూచనలను, మర్మములను, నియమములను,  అంగన్యాస, కరన్యాసములను, ధ్యాన శ్లోకములను, కవచం, స్తోత్రం, మొదలగునవి జాగ్రత్తగా  తెలుసుకొని సాధన ప్రారంభించ వలెను. వైదిక మార్గములో సాధన చేసే వారికి వయో వస్థా వివర్జిత అయిన ఆ మహాకాళి పరికిణీ కట్టుకొని ఎగురుతూ నడిచే బాలికగా కనిపిస్తుంది. మహాకాళి అయినా కన్న తల్లిగా, కన్న బిడ్డగా దర్శనం ఇస్తుంది. అవైదిక మార్గములో సాధన చేసిన వారికి కోరలతో నోరు తెరిచి రక్తాన్ని త్రాగే త్రిలోక భయంకర రాక్షసిగా అమ్మ దర్శనం ఇస్తుంది.

 

విద్యుచ్చక్తి లేక మెరుపుగా జిగిల్లుమనే నీల మేఘమే కాళీమాత. విద్యుత్తే ఆమె సౌందర్యం.

కాళీ ఉపాసకులు కాళీలో ప్రాణ శక్తిని మాత్రమే చూస్తారు, వృద్దునిలో శిశువును, శిశువులో వృద్దుని చూస్తారు. దేవి కాల రూపిణి గనుక వర్షా మేఘం వంటి నల్లని శరీరాన్ని ఉపాసనలో చూస్తారు. అనాహత చక్రం దేవి నివాసం అంటే గుండెకాయ. గుండెకాయ ప్రతి నిత్యం రక్తంలో మునిగి రక్తాన్ని పీల్చి విడుస్తూ ఉంటుంది. అందుకనే ఆమెను రక్తకాళీ అంటారు. గుండె ద్వారాలకు అమర్చబడిన కవాటాలు, తెరుచుకొంటూ, మూసుకొంటూ ఉండే వాల్వులు, దేవి జిహ్వలు. కాళికాదేవి శరీరమే జగత్ప్రలయ రాత్రి మేఘ విద్యుల్లతల సన్నివేశం, భావ భావ కళా జగత్సర్వాన్ని ప్రదర్శిస్తుంది.  

కాళీ మాత అంటే కాలం, సృష్టి అంటే ఆ తల్లి కనే సంతానం, తల్లి లేకుండా  పిల్లలు పుట్టరు. అంటే ప్రసవణీ ధర్మం ఉన్నదే తల్లి. అది ఆడపుట్టుక ధర్మం. కాబట్టి సృష్టికారిణి అయిన దేవి ప్రసవ ధర్మిణి అయిన కారణంగా స్త్రీ దేవతగానే ఆ పరతత్వాన్ని పూజించాలని మంత్ర మహోధది  చెబుతుంది.  అమ్మ అమ్మయే. పర బ్రహ్మం నకు చీర కడితే పర దేవత అవుతుంది.  భద్రకాళి, మహాకాళి, రుద్ర కాళి అయినా నాకు ఆమె కన్న తల్లియే. ఆమె లేనిదే ఈ భాస్కరుడు లేడు.

జయంతీ మంగళా కాళీ భద్ర కాళీ కపాలినీ,

దుర్గా క్షమా శివా ధాత్రీ స్వాహా స్వథా నమోzస్తుతే ||

ఇతి నమస్కారః
 

మీ
శ్రీ భాస్కరానంద నాథ / 23-07-2013

పూర్తి సమాచారము కొరకు దర్శించండి :-

Thursday, 25 July 2013

http://vanadurga-mahavidya.blogspot.in/

Consider who you share this email with – anyone can reshare it.
You have received this message because శ్రీ భాస్కరానంద నాథ shared it with bhaskaranandanatha.1960@blogger.com. Unsubscribe from these emails.
You can't reply to this email. View the post to add a comment.
Google Inc., 1600 Amphitheatre Pkwy, Mountain View, CA 94043 USA

శ్రీ మహాలక్ష్మి సాధన - 4


శ్రీ మహాలక్ష్మి సాధన - 4

శ్రీ మహా లక్ష్మీ దేవిని వివిధ రీతులలో పూజించే సాంప్రదాయములు లోకములో గలవు. ఎవరి కోరికలను బట్టి వారు వివిధ నామములతో ఆ మహాదేవిని కొలవవచ్చును. అధికారమును కోరేడి వారు శ్రీ మహా లక్ష్మిని సామ్రాజ్యలక్ష్మీ దేవిగా, ఓం శ్రీం  రాజమాతంగై నమః ...అని ఉపాసించ వలెను. ఐశ్వర్యమును కోరేడి వారు శ్రీ మహాలక్ష్మిని కుబేర మంత్ర సహితముగా పూజించ వలెను. గో సంపద కోరేడి వారు గో శాల యందు కూర్చొని లక్ష్మీ స్తోత్రం చేయ వలెను.

బ్రహ్మ పురాణంలో భగవానుడైన విష్ణు మూర్తి స్వయముగా శ్రీ లక్ష్మి సహస్రనామము గూర్చి బ్రహ్మకు ఉపదేశించినాడని తెలుప బడుతోంది. పూర్వం బ్రహ్మ దేవుడు కృతయుగంలో లోకసృష్టి జరిపినాడు, కాని తన అనంత సృష్టి వలన మానవాళికి కావలసిన ఆహారము ఏ విధముగా సమకూర్చ వలెను అని ఆలోచనలో పడెను.

ప్రజలందరూ సుఖముగా జీవించుటకు, సర్వ సంపదలు పొందుటకు,దారిద్ర్యము పారద్రోలుటకు ఏమిటి ఉపాయము అని సాక్షాత్ శ్రీ విష్ణుమూర్తిని ప్రార్ధించుట కొరకై గొప్ప తపము ఆచరించెను. అంతట లక్ష్మీ నారాయణుడు సంతసించి బ్రహ్మ దేవునికి సాక్షాత్కారించెను. దారిద్ర్య నాశనమునకు నివారణోపాయములు తెలుపమని వేడుకొనగా ఆ శేషశాయి ప్రసన్నుడై, శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క సహస్ర నామములను బ్రహ్మకు ఉపదేశించెను. ఈ పారాయణ  చాలా అత్యుత్తమైనది. అన్ని జీవుల యందు వున్న ప్రాణ శక్తియే ఈ మహా లక్ష్మి. ధనాశతో జీవుని బంధించు కర్మ స్వరూపిణి మాత్రమె కాకుండా మోక్షమును ప్రసాదించే మోక్ష లక్ష్మి కూడా ఈమెయే అయినది.. జీవుడు చతుర్విధ పురుషార్ధములలో ముందుగా ధర్మము సాధన చేసి అనంతరము అర్ధము (ధనము) పొందవలెనని ఆశించితే ఆ శ్రీదేవి  ముందు జీవుని సమస్త కోరికలను తీర్చి అనంతరము మోక్షమును ప్రసాదించును.

శ్రీ మహాలక్ష్మీ ధ్యానము చేయు విధానము:- శ్రీ మహాలక్ష్మీ దేవి యొక్క చిత్తేరవు(పటము) ఈ క్రింది విధముగా వున్నది ఎంచుకొనవలెను. శ్రీ మహాలక్ష్మీ దేవి పద్మాసనస్థురాలిగాను శ్రీ లక్ష్మీ దేవి యంత్రమున లేదా పద్మమున  ఆసీనురాలై ఉండవలెను. ఆ దేవికి ఇరుప్రక్కల రెండు తెల్ల ఏనుగులు అమృత కలశములతో అభిషేకము జరుపుతున్నట్లుగా ఉండవలెను. ఇంకా ఆ మహాదేవి కామధేనువు, కల్పవృక్షము, చింతామణి, ఐరావతము, శంఖనిధి, పద్మనిధి, మొదలైన నవ నిధులతో సేవించ బడుతున్నట్లు ఉండవలెను. తెల్లని చత్రము, రెండు చామరములచే మహారాజోపచారం పొందుచున్నట్లు ఉండుచూ రెండు హస్తముల యందు రెండు పద్మములు ధరించుతూ వరద, అభయ ముద్రలతో సర్వ రత్నాభరణ భూషితయై ఐశ్వర్యమును సిద్ధింపజేయు మాతృమూర్తిగా మహాలక్ష్మిని ధ్యానించవలయును. 

శ్రీ మహావిష్ణువు యొక్క హృదయ పీఠము నందు ఉండే దయయే అనుగ్రహ మూర్తిగా రూపుకట్టి సాక్షాత్కరించిన మూర్తియే శ్రీ మహాలక్ష్మి.  కావున మహా లక్ష్మీ అనుగ్రహము కొరకు శ్రీ మహావిష్ణువు యొక్క హృదయ పీఠమును అలంకరించిన ఆ మహా తల్లిని కొలవవలయును. ఈ దేవిని కొలుచుటకు అనుకూలమైన దినములు, విశేష ఫలితములు నొసంగే అనువైన పర్వదినములు శరన్నవరాత్రములు మరియు శ్రావణ మాసము.  శ్రావణ మాసము రెండవ శుక్రవారము అమ్మకు అత్యంత పవిత్రమైన, ఆరాధ్యమైన రోజు. కార్తీక శుక్ల పంచమి నుంచి కార్తీక పున్నమి వరకు గల పర్వ దినములు శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన రోజులు.

పూజా విధానము:- వ్రత కల్పానుసారము

ముందుగా సాధకుడు శ్రీ మహాలక్ష్మిని పైన తెలిపిన విధానముగా, శక్త్యానుసారముగా బంగారంతో గాని, వెండితో గాని లేదా పంచాలోహములతో చేసిన విగ్రహము గానీ, కనీసం పటమునైనా గాని తీసుకొనవలయును. పీఠముపై ధాన్యము పోసి సమానముగా చేసి, పట్టు వస్త్రమును ఉంచి, బియ్యము పిండి, పసుపు, కుంకుమ, చందనములతో అందముగా రంగు వల్లికను వేసి, అమ్మ వారి విగ్రహమును గానీ, పటమును గానీ స్థాపించ వలయును. అనంతరము ఆ దేవి విగ్రహము ముందు కలశమును, లక్ష్మీ యంత్రమును స్థాపించి, ఆవు నేతితో గానీ, లేక నువ్వుల నూనెతో గానీ దీపారాధన చేయవలెను. ధూపమును వేయవలెను.

దేవి విగ్రహమునకు ఎర్రని పువ్వులతో, పరిమళములను వెదజల్లు పుష్పములతో అందముగా అలంకరించి, బంగారు నగలతో ఆమెకి అలంకారము చేసి, పూజ ప్రాంభించ వలెను. గురుదేవులను, విఘ్నేశ్వరున్ని ధ్యానించి, ప్రాణాయామము చేసి లక్ష్మీ దేవి యొక్క మూల మంత్రమును మనస్సు నందు 108 సార్లు అంగన్యాస, కరన్యాసములతో, జపము చేయవలెను. శ్రీ మహా విష్ణువును ఆరాధించవలెను. కల్పోక్త ప్రకారము శ్రీ మహాలక్ష్మి దేవికి షోడశోపచారములచే పూజ చేసి, అనంతరము లక్ష్మీ సహస్ర నామార్చన వేదోక్త ప్రకారముగా చేయ వలెను. తరువాత లక్ష్మీ దేవికి ప్రీతికరమైన నైవేద్యములు సమర్పించి, మంత్ర పుష్పములతో పుష్పాంజలి సమర్పించి, కర్పూర నీరాజనము ఇచ్చి, లక్ష్మీ దేవిపై సంకీర్తన గానం చేయవలెను. ఇలా చేసిన వారిపై అమ్మ యొక్క అనుగ్రహము సంపూర్ణముగా అన్ని సమయముల యందు ప్రసరింప చేయుచుండును.

మూల మంత్రములు :-  వేద మంత్రములు

శ్రీం ... మహాలక్ష్మీ బీజము , హ్రీం ... మాయా బీజము. ఈ౦.... శక్తి బీజము. క్లీం ... మన్మధ బీజము,

క్రీ౦... కాళీ బీజము, ఐ౦... వాగ్బీజము.

౧. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహా లక్ష్మైనమః.

౨. ఓం శ్రీం మహా లక్ష్మైనమః.

౩.  ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి మహాలక్ష్మి ఏహ్యేహి, సర్వ సౌభాగ్యం మే దేహి స్వాహా|

౪. ఓం ఐ౦ శ్రీం హ్రీం క్లీం లక్ష్మీ నారాయణాయ నమః

౫. ఓం శ్రీం శ్రీయై నమః.

౬. ఓం నమః కమల వాసిన్యై స్వాహా

7. ఓం శ్రీం హ్రీం క్లీం ఐ౦ కమల వాసిన్యై స్వాహా. (దేవీ భాగవతము)

గమనిక:-  మంత్రములను గురువుల ద్వారా ఉపదేశము పొంది, శ్రద్ధతో ఉపాసన చేయ వలెను.

శ్రీ సూక్తము స్వర యుక్తముగా చదువ లేని వారికి, శ్రీ సూక్త నామావళితో అర్చన చేసుకోన వచ్చును.

శ్రీ సూక్తము – నామావళి
1
ఓం హిరణ్య వర్ణాయై నమః
19
ఓం తర్పయంత్యై నమః
37
ఓం ఈశ్వర్యై నమః
2
ఓం హరిణ్యై నమః
20
ఓం పద్మేస్థితాయై నమః
38
ఓం మనసః కామాయ నమః
3
ఓం సువర్ణ రజత స్రజే నమః
21
ఓం పద్మ వర్ణాయై నమః
39
ఓం వాచ ఆకూత్యై నమః
4
ఓం చంద్రాయై నమః
22
ఓం చంద్రాయై నమః
40
ఓం సత్యాయై నమః
5
ఓం  హిరణ్మై నమః
23
ఓం ప్రభాసాయై నమః
41
ఓం పశూనాం రూపాయ నమః
6
ఓం లక్ష్మైనమః
24
ఓం యశాసాయై నమః
42
ఓం అన్నస్య యశసే నమః
7
ఓం అనప గామిన్యై నమః
25
ఓం జ్వలంత్యై నమః
43
ఓం మాత్రే నమః
8
ఓం అశ్వపూర్వాయై నమః
26
ఓం దేవ జుష్టాయై నమః
44
ఓం పద్మ మాలిన్యై నమః
9
ఓం రధమధ్యాయై నమః
27
ఓం ఉదారాయై నమః
45
ఓం పుష్కరిణ్యై నమః
10
ఓం హస్తినాద ప్రభోధిన్యై నమః
28
ఓం తాయై నమః
46
ఓం యష్టయే నమః
11
ఓం శ్రియై నమః
29
ఓం పద్మ నేమ్యై నమః
47
ఓం పింగళాయై నమః
12
ఓం దేవ్యై నమః
30
ఓం ఆదిత్య వర్ణాయై నమః
48
ఓం తుష్టయే నమః
13
ఓం కాయై నమః
31
ఓం కీర్త్యై నమః
49
ఓం సువర్ణాయై నమః
14
ఓం సోస్మితాయై నమః
32
ఓం బుద్ధ్యై నమః
50
ఓం హేమ మాలిన్యై నమః
15
ఓం హిరణ్య ప్రాకారాయై నమః
33
ఓం గంధ ద్వారాయై నమః
51
ఓం సూర్యాయై నమః
16
ఓం ఆర్దాయై నమః
34
ఓం దురా ధర్షాయై నమః 
 
 
17
ఓం జ్వలన్త్యై నమః
35
ఓం నిత్య పుష్టాయై నమః
 
 
18
ఓం తృప్తాయై నమః
36
ఓం కరీషిణ్యై నమః
 
 

సశేషం .....


శ్రీ భాస్కరానంద నాథ