శ్రీ
మహాలక్ష్మి సాధన - 4
శ్రీ మహా లక్ష్మీ దేవిని వివిధ
రీతులలో పూజించే సాంప్రదాయములు లోకములో గలవు. ఎవరి కోరికలను బట్టి వారు వివిధ
నామములతో ఆ మహాదేవిని కొలవవచ్చును. అధికారమును కోరేడి వారు శ్రీ మహా లక్ష్మిని
సామ్రాజ్యలక్ష్మీ దేవిగా, ఓం శ్రీం రాజమాతంగై నమః ...అని
ఉపాసించ వలెను. ఐశ్వర్యమును కోరేడి వారు శ్రీ మహాలక్ష్మిని కుబేర మంత్ర సహితముగా
పూజించ వలెను. గో సంపద కోరేడి వారు గో శాల యందు కూర్చొని లక్ష్మీ స్తోత్రం చేయ
వలెను.
బ్రహ్మ పురాణంలో భగవానుడైన విష్ణు
మూర్తి స్వయముగా శ్రీ లక్ష్మి సహస్రనామము గూర్చి బ్రహ్మకు ఉపదేశించినాడని తెలుప
బడుతోంది. పూర్వం బ్రహ్మ దేవుడు కృతయుగంలో లోకసృష్టి జరిపినాడు, కాని తన అనంత
సృష్టి వలన మానవాళికి కావలసిన ఆహారము ఏ విధముగా సమకూర్చ వలెను అని ఆలోచనలో పడెను.
ప్రజలందరూ సుఖముగా జీవించుటకు,
సర్వ సంపదలు పొందుటకు,దారిద్ర్యము పారద్రోలుటకు ఏమిటి ఉపాయము అని సాక్షాత్ శ్రీ
విష్ణుమూర్తిని ప్రార్ధించుట కొరకై గొప్ప తపము ఆచరించెను. అంతట లక్ష్మీ నారాయణుడు
సంతసించి బ్రహ్మ దేవునికి సాక్షాత్కారించెను. దారిద్ర్య నాశనమునకు నివారణోపాయములు
తెలుపమని వేడుకొనగా ఆ శేషశాయి ప్రసన్నుడై, శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క సహస్ర
నామములను బ్రహ్మకు ఉపదేశించెను. ఈ పారాయణ
చాలా అత్యుత్తమైనది. అన్ని జీవుల యందు వున్న ప్రాణ శక్తియే ఈ మహా లక్ష్మి.
ధనాశతో జీవుని బంధించు కర్మ స్వరూపిణి మాత్రమె కాకుండా మోక్షమును ప్రసాదించే మోక్ష
లక్ష్మి కూడా ఈమెయే అయినది.. జీవుడు చతుర్విధ పురుషార్ధములలో ముందుగా ధర్మము సాధన
చేసి అనంతరము అర్ధము (ధనము) పొందవలెనని ఆశించితే ఆ శ్రీదేవి ముందు జీవుని సమస్త కోరికలను తీర్చి అనంతరము
మోక్షమును ప్రసాదించును.
శ్రీ
మహాలక్ష్మీ ధ్యానము చేయు విధానము:- శ్రీ మహాలక్ష్మీ దేవి యొక్క
చిత్తేరవు(పటము) ఈ క్రింది విధముగా వున్నది ఎంచుకొనవలెను. శ్రీ మహాలక్ష్మీ దేవి పద్మాసనస్థురాలిగాను
శ్రీ లక్ష్మీ దేవి యంత్రమున లేదా పద్మమున
ఆసీనురాలై ఉండవలెను. ఆ దేవికి ఇరుప్రక్కల రెండు తెల్ల ఏనుగులు అమృత
కలశములతో అభిషేకము జరుపుతున్నట్లుగా ఉండవలెను. ఇంకా ఆ మహాదేవి కామధేనువు,
కల్పవృక్షము, చింతామణి, ఐరావతము, శంఖనిధి, పద్మనిధి, మొదలైన నవ నిధులతో సేవించ
బడుతున్నట్లు ఉండవలెను. తెల్లని చత్రము, రెండు చామరములచే మహారాజోపచారం
పొందుచున్నట్లు ఉండుచూ రెండు హస్తముల యందు రెండు పద్మములు ధరించుతూ వరద, అభయ
ముద్రలతో సర్వ రత్నాభరణ భూషితయై ఐశ్వర్యమును సిద్ధింపజేయు మాతృమూర్తిగా
మహాలక్ష్మిని ధ్యానించవలయును.
శ్రీ మహావిష్ణువు యొక్క హృదయ
పీఠము నందు ఉండే దయయే అనుగ్రహ మూర్తిగా రూపుకట్టి సాక్షాత్కరించిన మూర్తియే శ్రీ
మహాలక్ష్మి. కావున మహా లక్ష్మీ అనుగ్రహము
కొరకు శ్రీ మహావిష్ణువు యొక్క హృదయ పీఠమును అలంకరించిన ఆ మహా తల్లిని కొలవవలయును.
ఈ దేవిని కొలుచుటకు అనుకూలమైన దినములు, విశేష ఫలితములు నొసంగే అనువైన పర్వదినములు
శరన్నవరాత్రములు మరియు శ్రావణ మాసము. శ్రావణ
మాసము రెండవ శుక్రవారము అమ్మకు అత్యంత పవిత్రమైన, ఆరాధ్యమైన రోజు. కార్తీక శుక్ల
పంచమి నుంచి కార్తీక పున్నమి వరకు గల పర్వ దినములు శ్రీ మహాలక్ష్మికి అత్యంత
ప్రీతికరమైన రోజులు.
పూజా విధానము:- వ్రత
కల్పానుసారము
ముందుగా సాధకుడు
శ్రీ మహాలక్ష్మిని పైన తెలిపిన విధానముగా, శక్త్యానుసారముగా బంగారంతో గాని, వెండితో
గాని లేదా పంచాలోహములతో చేసిన విగ్రహము గానీ, కనీసం పటమునైనా గాని తీసుకొనవలయును.
పీఠముపై ధాన్యము పోసి సమానముగా చేసి, పట్టు వస్త్రమును ఉంచి, బియ్యము పిండి,
పసుపు, కుంకుమ, చందనములతో అందముగా రంగు వల్లికను వేసి, అమ్మ వారి విగ్రహమును గానీ,
పటమును గానీ స్థాపించ వలయును. అనంతరము ఆ దేవి విగ్రహము ముందు కలశమును, లక్ష్మీ
యంత్రమును స్థాపించి, ఆవు నేతితో గానీ, లేక నువ్వుల నూనెతో గానీ దీపారాధన
చేయవలెను. ధూపమును వేయవలెను.
దేవి విగ్రహమునకు ఎర్రని
పువ్వులతో, పరిమళములను వెదజల్లు పుష్పములతో అందముగా అలంకరించి, బంగారు నగలతో ఆమెకి
అలంకారము చేసి, పూజ ప్రాంభించ వలెను. గురుదేవులను, విఘ్నేశ్వరున్ని ధ్యానించి,
ప్రాణాయామము చేసి లక్ష్మీ దేవి యొక్క మూల మంత్రమును మనస్సు నందు 108 సార్లు అంగన్యాస, కరన్యాసములతో,
జపము చేయవలెను. శ్రీ మహా విష్ణువును ఆరాధించవలెను. కల్పోక్త ప్రకారము శ్రీ మహాలక్ష్మి
దేవికి షోడశోపచారములచే పూజ చేసి, అనంతరము లక్ష్మీ సహస్ర నామార్చన వేదోక్త
ప్రకారముగా చేయ వలెను. తరువాత లక్ష్మీ దేవికి ప్రీతికరమైన నైవేద్యములు సమర్పించి,
మంత్ర పుష్పములతో పుష్పాంజలి సమర్పించి, కర్పూర నీరాజనము ఇచ్చి, లక్ష్మీ దేవిపై
సంకీర్తన గానం చేయవలెను. ఇలా చేసిన వారిపై అమ్మ యొక్క అనుగ్రహము సంపూర్ణముగా అన్ని
సమయముల యందు ప్రసరింప చేయుచుండును.
మూల మంత్రములు :- వేద మంత్రములు
శ్రీం ... మహాలక్ష్మీ బీజము , హ్రీం ... మాయా బీజము. ఈ౦.... శక్తి బీజము.
క్లీం ... మన్మధ బీజము,
క్రీ౦... కాళీ బీజము, ఐ౦... వాగ్బీజము.
౧. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం
హ్రీం శ్రీం ఓం మహా లక్ష్మైనమః.
౨. ఓం శ్రీం మహా లక్ష్మైనమః.
౩. ఓం శ్రీం హ్రీం
క్లీం మహాలక్ష్మి మహాలక్ష్మి ఏహ్యేహి, సర్వ సౌభాగ్యం మే దేహి స్వాహా|
౪. ఓం ఐ౦ శ్రీం హ్రీం క్లీం లక్ష్మీ నారాయణాయ నమః
౫. ఓం శ్రీం శ్రీయై నమః.
౬. ఓం నమః కమల వాసిన్యై స్వాహా
7. ఓం శ్రీం
హ్రీం క్లీం ఐ౦ కమల వాసిన్యై స్వాహా. (దేవీ భాగవతము)
గమనిక:-
మంత్రములను గురువుల ద్వారా ఉపదేశము పొంది, శ్రద్ధతో ఉపాసన చేయ వలెను.
శ్రీ సూక్తము స్వర యుక్తముగా చదువ లేని వారికి, శ్రీ సూక్త
నామావళితో అర్చన చేసుకోన వచ్చును.
శ్రీ సూక్తము – నామావళి
|
|||||
1
|
ఓం హిరణ్య వర్ణాయై నమః
|
19
|
ఓం తర్పయంత్యై నమః
|
37
|
ఓం ఈశ్వర్యై నమః
|
2
|
ఓం హరిణ్యై నమః
|
20
|
ఓం పద్మేస్థితాయై నమః
|
38
|
ఓం మనసః కామాయ నమః
|
3
|
ఓం సువర్ణ రజత స్రజే నమః
|
21
|
ఓం పద్మ వర్ణాయై నమః
|
39
|
ఓం వాచ ఆకూత్యై నమః
|
4
|
ఓం చంద్రాయై నమః
|
22
|
ఓం చంద్రాయై నమః
|
40
|
ఓం సత్యాయై నమః
|
5
|
ఓం హిరణ్మై నమః
|
23
|
ఓం ప్రభాసాయై నమః
|
41
|
ఓం పశూనాం రూపాయ నమః
|
6
|
ఓం లక్ష్మైనమః
|
24
|
ఓం యశాసాయై నమః
|
42
|
ఓం అన్నస్య యశసే నమః
|
7
|
ఓం అనప గామిన్యై నమః
|
25
|
ఓం జ్వలంత్యై నమః
|
43
|
ఓం మాత్రే నమః
|
8
|
ఓం అశ్వపూర్వాయై నమః
|
26
|
ఓం దేవ జుష్టాయై నమః
|
44
|
ఓం పద్మ మాలిన్యై నమః
|
9
|
ఓం రధమధ్యాయై నమః
|
27
|
ఓం ఉదారాయై నమః
|
45
|
ఓం పుష్కరిణ్యై నమః
|
10
|
ఓం హస్తినాద ప్రభోధిన్యై నమః
|
28
|
ఓం తాయై నమః
|
46
|
ఓం యష్టయే నమః
|
11
|
ఓం శ్రియై నమః
|
29
|
ఓం పద్మ నేమ్యై నమః
|
47
|
ఓం పింగళాయై నమః
|
12
|
ఓం దేవ్యై నమః
|
30
|
ఓం ఆదిత్య వర్ణాయై నమః
|
48
|
ఓం తుష్టయే నమః
|
13
|
ఓం కాయై నమః
|
31
|
ఓం కీర్త్యై నమః
|
49
|
ఓం సువర్ణాయై నమః
|
14
|
ఓం సోస్మితాయై నమః
|
32
|
ఓం బుద్ధ్యై నమః
|
50
|
ఓం హేమ మాలిన్యై నమః
|
15
|
ఓం హిరణ్య ప్రాకారాయై నమః
|
33
|
ఓం గంధ ద్వారాయై నమః
|
51
|
ఓం సూర్యాయై నమః
|
16
|
ఓం ఆర్దాయై నమః
|
34
|
ఓం దురా ధర్షాయై నమః
|
||
17
|
ఓం జ్వలన్త్యై నమః
|
35
|
ఓం నిత్య పుష్టాయై నమః
|
||
18
|
ఓం తృప్తాయై నమః
|
36
|
ఓం కరీషిణ్యై నమః
|
సశేషం .....
శ్రీ భాస్కరానంద నాథ
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.