శ్రీదేవీ తత్వం – 9 - త్రిగుణ స్వరూపము.
౧. సత్వగుణ లక్షణములు:-
సత్యము, శౌచము, శ్రద్ధ, క్షమ, ధైర్యము, దయ, లజ్జ, శాంతి, సంతోషము
కాబట్టి సత్వగుణ లక్షణములను పెంపోదించు కోవాలంటే పై గుణములను అలవాటు
చేసుకోవలెను.
ఇది తెల్లని వర్ణము గలది. ఇది ధర్మమునందు ప్రీతిని కలిగించును.
౨. రజో గుణ లక్షణములు:-
ఇది రక్త వర్ణము. ఇది దు:ఖ సంయోగమున కలుగును.
మదము, గర్వము, ద్రోహ చింతన, మచ్చరము.
౩. తమో
గుణ లక్షణములు:-
ఇది నల్లని రంగు కలది. మోహము, విషాదము,
అజ్ఞానము, అలసత్వము, నిద్ర, దైన్యము, భయము,
వివాదము, కృపణత్వము, కుటిలత్వము, వైషమ్యము, నాస్తికత, పర దోష దర్శనము.
తనకు శుభము కోరువాడు సత్వ గుణమును ప్రకాశింప జేయవలెను. రజోగుణమును
అణచి పెట్టవలెను, తమోగుణమును సంహరించవలెను.
ఆ మహా మాయా శక్తియే యీ సదసదాత్మకమైన బ్రహ్మాండము
లందు బ్రహ్మ, విష్ణు, రుద్రులు మొన్నగు దేవతలందరినీ వారి వారి గుణ కర్మ విభాగమున
సృజించును. వీరేల్లరూ ఆ శక్తితో యుక్తులగుటచే కార్యకరణ దక్షు లగుచున్నారు. ఆ శక్తి
లేనిచో వారు ఎంత మాత్రమూ చలింపజాలరు. ఆ తల్లియే శ్రీ మహాకాళి, మహా సరస్వతి, మహా
లక్ష్మి రూపములతో నిత్య పూజలందు కొనుచున్నది. ఆమెయే సర్వ భూతేశ్వరి.
సృష్టికి పూర్వమున్నది మహా బిందువు. సృష్టికి
ముందు సత్ అను పదార్ధముండెను. ఇదియే చిదగ్నిగా ఉపదేశింపబడిన బ్రహ్మ పదార్ధము.
ఇదియే మొట్ట మొదటి మహా బిందువు.
ఆత్మా వా ఇదమేక ఏవాగ్ర ఆసీత్, నాన్యత్కించన.
మిషత్, స ఈక్షత లోకాన్ను సృజా ఇతి.
( ఐతరేయోపనిషత్తు 1-1-1)
ఈ ప్రపంచమున సృష్టికి పూర్వము ఒకే ఆత్మ ( ఒకే
బిందువు) గా వుండినది. ఆ ఆత్మ తప్ప వేరొకటి ఏదియునూ లేదు. ఆ ఆత్మ లోకములను సృష్టించవలయునని ఆలోచించెను.
స
దేవ సోమ్యేదమగ్ర ఆసీ దేకమేవాద్వితీయం .....
ఛాందోగ్యోపనిషత్తు ... 6-2-1
ఈ జగత్తు ఉత్పన్న మగుటకు పూర్వము సత్తుగా ఏకమై, అద్వితీయమై యుండినది.
“ హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ “
... పురుష సూక్తం.
బ్రహ్మ వాచకమయిన
ప్రణవమునకు హ్రీ, శ్రీ లు రెండునూ పత్నీ
స్థానీయములు. ప్రణవము చిదగ్నికి నిర్దేశాక్షరము.
చిదగ్ని యందలి మహాగ్నిని మంత్ర శాస్త్ర రీత్యా రేఫ (ర) సూచిస్తుంది. అట్టి మహాగ్నికి వేడి, వెలుతురు, అనేవి రెండు
లక్షణములు, అందు హ్రీ వెలుతురు
(తేజస్సును) ను, శ్రీ వేడిని తెలియ చెప్పుచున్నది. ఈ రెండును అగ్ని లక్షణములు గనుకనే రెంటి యందును
రేఫ లున్నవి. శ్రీచక్రమనగా సృష్టి స్థితులను
నిర్వచించు యంత్ర విశేషము. హ్రీ చక్రమనగా స్థితి సంహారములను తెలియజేయు యంత్ర సంకేతము.
శ్రీవిద్యలో రుద్ర,
నమక, చమక, పురుష, శ్రీ సూక్తముల యొక్క మంత్ర రహస్యములు ఎన్నో గలవు. వాటిని గురు ముఖత నేర్చుకోనవలెను.
శ్రీ
మాత్రేనమః స్వస్తి. // మీ భాస్కరానంద నాధ, // 14-10-2012
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.