Sri Bhaskarananda Natha
On 29 Dec 2012 16:53, "శ్రీ భాస్కరానంద నాథ" <bhaskaranandanatha@gmail.com> wrote:
మంత్ర సాధన-రహస్యములు
మంత్ర సాధన-రహస్యములు
గురువులకు,పెద్దలకు,మిత్రులకు నమస్కారములు.చాలామంది అంటూ వుంటారు "మంత్రాలు అంటే ఏమిటి? వాటి అర్ధము ఏమిటి? మంత్రాలు ఎందుకు? వాటి అర్ధం తెలియకుండా చదివితే ఉపయోగామేమిటి? అని. అసలు మంత్రాలు సంస్కృతం లోనే ఎందుకు చదవాలి? తెలుగులో తర్జుమా చేసుకొని చదువ కూడదా అని? మనకు మంత్రం శాస్త్రం అవసరమా? ఎన్ని రకాల మంత్రాలు వున్నాయి? సంస్కృత భాషలోనే మంత్ర శాస్త్రము ఎందుకు వున్నది?మంత్రం అంటే ఏమిటి? వాటిలో రకాలు ఎలా సాధన చేయాలి? మంత్రానికి, స్తోత్రానికి గల భేదమేమి? ఎవరెవరు చదువ వచ్చును? మంత్ర సాధన ఎట్లా, పురశ్చరణ ఎలా? భూత సిద్ది, ఆసన సిద్ది, మంత్ర సిద్ది, దిగ్భందనము, మంత్ర న్యాసము, ముద్రలు, మంత్రోపదేశము, మంత్ర ముహూర్తము, గురు-శిష్యుల అర్హత, మంత్ర శాస్త్ర ప్రయోగము, మంత్ర సాధన, విధి విధానములు, మంత్రములలో రకములు.అష్టాదశ పురాణములలో, ప్రపంచ సార సార-సంగ్రహం, మంత్ర మహార్ణవం, మంత్ర మహోదధి, శారదా తిలక తంత్రం, రుద్ర యామల తంత్రం, సనత్కుమార సంహిత, శివ జ్ఞాన తంత్రం, తంత్ర సార సర్వస్వం, శ్రీవిద్యా తంత్రం, శబ్ద కల్పద్రుమం, పురశ్చరణ దీపిక, మంత్రం దీపిక, నారద పాంచరాత్రము, అగస్త్య సంహిత, దశ మహా విద్యలు, జ్ఞానార్నవ తంత్రం, నారాయణ తంత్రం, యోగినీ హృదయం, పరుశురామ కల్పం, దత్తాత్రేయ కల్పం, హయగ్రీవ కల్పం, సుభగోదయం, కామకలా విలాసము, వరివశ్యా రహస్యం, లాంటి గొప్ప అపూర్వ గ్రంధముల నుంచి శాస్త్రముల నుంచి ఆ తల్లి దయతో నేను తెలుసుకోబడ్డ మంత్రం శాస్త్ర విషయములను ఇక్కడ మనము త్వరలో తెలుసుకోబోవుచున్నాము.మంత్రం శాస్త్ర గ్రంధములలో ముందుగా చెప్పదగినవి ౧. మంత్ర మహార్ణవము, రెండవది కల్ప వృక్షం వంటి గ్రంధం శంకరాచార్య ప్రణీతమైన "ప్రపంచ సార సార-సంగ్రహం. మూలమును శంకర భగవత్పాదులు రచించగా, దానికి శ్రీ శ్రీ శ్రీ గీర్వాణే౦ద్ర సరస్వతి స్వామి వారు అద్బుతమైన వాఖ్య వ్రాసినారు. మూడవది శ్రీ పుణ్యానంద మునీంద్ర విరచిత శ్రీ కామకలా విలాసము. నాల్గువది శ్రీ శారదా తిలక తంత్రం.శ్రీ గౌడపాదులు, శ్రీ విద్యారణ్య స్వామీ మొదలగు మహా పురుషులు మనకు ఎన్నో మంత్ర తంత్ర రహస్యములను అందించి వున్నారు.. మహా విజ్ఞానమును మన ఋషులు ఇచ్చి వున్నారు. అందులోని ముఖ్య విషయములను, పెద్దల నుంచి తెలుసుకున్న మేర, మీతో పంచుకోవడానికి చేసే చిన్న ప్రయత్నమే ఇది.శ్రద్ధతో ఆలకించేదరని ఆశిస్తూ,త్వరలోనే.
మీశ్రీ భాస్కరానంద నాథమహావిద్యోపాసకులు, మహాపాదుకాంత శ్రీవిద్యాపూర్ణ దీక్షాపరులు.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.