శ్రీ మహాలక్ష్మి సాధన - 2
4 వ మంత్రము :- శ్రీసూక్తము
21 రోజులు శ్రద్ధతో నియమ నిష్టలతో, శ్రీ సూక్తముతో
లక్ష్మీ యంత్రమును గానీ, లేక శ్రీ మహాలక్ష్మి వెండి విగ్రహమునకు గానీ రోజూ
పంచామృతముతో, ఆవు పాలతో అభిషేకము చేసి, ధూప, దీప, నైవేధ్యములతో, అష్టోత్తర నామములతో
అర్చించి, పూజించి, రోజూ 108 సార్లు శ్రీ సూక్త పారాయణ
జపము శ్రద్ధతో చేయ వలెను.
నియమములు:- బ్రహ్మచర్యము, భూశయనము, ఏక భుక్తము.
5 వ మంత్రము
ఓం హ్రీం దారిద్ర్య దు:ఖ దహన మహా దేవాయనమః
ఈ మంత్రాన్ని లక్షా పాతిక వేలు జపము చేయవలెను. ఈ ప్రయోగాన్ని సోమవారం నాడు
ప్రారంభించి, ఒక పళ్ళెములో బాణ లింగమును (నర్మదేశ్వర శివ లింగము) ప్రతిష్టించి,
అభిషేకము చేసి, శివ అష్టోత్తర నామములతో అర్చించి బిల్వ పత్రములతో
పూజించి, పై మంత్రమును రుద్రాక్ష మాలతో, రోజుకు ఐదు వేలు చొప్పున
లక్షా పాతిక వేలు జపము చేయవలెను. ఇలా చేయుట వలన జన్మ జన్మల దారిద్ర్యము కూడా
నశించును.
6 వ మంత్రము
ఓం పద్మావతీ పద్మ నేత్రే, లక్ష్మీ దాయినీ, సర్వ కార్యసిద్ధి
కరి కరి, ఓం హ్రీం శ్రీం పద్మావత్యై నమః
ఈ మంత్రమును రాత్రి పూట సంధ్యా దీపము వెలిగించి, ఉత్తర ముఖము వైపు, తెల్లని
నూలు వస్త్రం పై కూర్చొని, రోజుకు 11000 చొప్పున లక్షా పాతిక వేలు
జపము చేయవలెను. శుక్ర వారము గానీ, బుధ వారము గానీ ప్రారంభించి తెల్లని వస్త్రము పై
శ్రీ యంత్రమును స్థాపించి, కుంకుమ పువ్వుతో పూజించి, ధూప, దీప, నైవేధ్యములతో, అష్టోత్తర
నామములతో అర్చించి, జపము పూర్తి అయిన తరువాత ఒక కన్యకు భోజనము పెట్టి, వస్త్రములు
పెట్టి పూజించ వలెను. దీనివలన ఆర్ధిక ఉన్నతి చాలా త్వరగా కనిపించును.
సశేషం .....
మీ
శ్రీ భాస్కరానంద నాథ
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.