ధర్మం ఎంత వరకు వుంటుంది ఈ భూమి మీద?
చాలా మందికి ఇదో అనుమానం. శాస్త్రం ఏమి చెబుతున్నదంటే గో క్షీరం భూమి మీద ఎంత వరకూ ఉంటె ధర్మం అంత వరకు చక్కగా వుంటుంది. గోక్షీరము అభివృద్ధి అవుతూ వుంటే ధర్మం కూడా అభివృద్ధి అవుతూ వుంటుంది. గో క్షీరం క్షీణిస్తూ వుంటే, ధర్మం కూడా క్షీణిస్తూ వుంటుంది.
ఏరోజు పూర్తిగా భూమిపై గో క్షీరం అంతరిస్తుందో, ఆరోజు ధర్మం పూర్తిగా మరుగున పడిపోతుంది. కాబట్టి గోవులను కాపాడి, ధర్మాన్ని రక్షించు కొందాము.
దానం చేయాలంటే పుచ్చుకోనేందుకు బ్రాహ్మణుడు లేకపోతే ఆ దానాన్ని,పెసలు, కందులు, నువ్వులు ఏదైతే ఉన్నదో అది ప్రవహించే నదిలో విడిచి పెట్టాలి. అప్పుడు అది దానం చేసిన దానితో సమానము అని పెద్దలు చెప్పినారు. ఒక వేళ ఆ ప్రాంతములో నది లేకపోతే ఆ పెసలను (దానమును) నీళ్ళల్లో నానబెట్టి గోవుకు బెల్లంతో పాటుగా తినిపించాలి. గోవు తింటే దానం ఇచ్చిన దానితో సమానము. గోవు తింటే అది బ్రాహ్మణులకు ఇచ్చినట్లే. గోవులో బ్రాహ్మణులు నివసిస్తూ వుంటారు.
కావున గోవులను, బ్రాహ్మణులను కాపాడుకొంటాము. బ్రాహ్మణీకాన్ని కాపాడుకొంటాము.
మీ
శ్రీ భాస్కరానంద నాథ
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.