తర్పణము
తర్పణము చేయడము వలన దేవతలు శీఘ్రముగా సంతుష్టులౌతారు. లేదా వారిని సంతృప్తి పరచే విధిని
తర్పణము అని అందురు. ఈ తర్పణము సకామ లేక నిష్కామములుగా
రెండు విధములుగా చేయ వచ్చును. సకామ తర్పణములో కొన్ని ప్రత్యేక
ద్రవ్యముల ద్వారా తర్పణము చేస్తారు. నిష్కామ తర్పణము జలముతో
చేయబడుతుంది.
దేవతలను ప్రసన్నము చేసుకోనబడుటకు, వారిని ప్రీతీ చేయుట కొరకు ఈ తర్పణము వదల బడుతుంది. తర్పణము అనేది మంత్ర సాధనలో ఒక ముఖ్య భాగము మరియు
అంగము అయివున్నది. సాధకుడు తద్దేవతకు తర్పణము గావించి, మంత్ర జపము చేయవలెను. ఇది ప్రతి దేవతకు వర్తిస్తుంది.
గురువుల ద్వారా మంత్రము, తర్పణ విధి తెలుసుకోవలయును.
౧. తేనె ద్వార తర్పణము చేయడము వలన
అన్ని కోరికలు నెర వేరుతాయి, అన్ని పాతకములు నాశనము అయి, మంత్ర సిద్ది కలుగుతుంది.
౨. కర్పూర జలముతో తర్పణము చేస్తే, రాజు వశ మోతాడు .
౩. పసుపు కలిపిన జలముతో తర్పణము
చేస్తే, సామాన్య వ్యక్తి వశ మోతాడు.
౪. ఆవు నేతితో తర్పణము చేస్తే, .......సుఖము
౫. కొబ్బరి నీళ్ళతో తర్పణము చేస్తే, ....... సర్వ సిద్ధి
౬. మిర్చి కలిపిన జలముతో తర్పణము
చేస్తే ........ శత్రు నాశనము
కల్పోక్త ప్రకారముగా సాధకుడు, స్నాన, పూజా, హోమ సమయము లందు ప్రతి రోజు దేవతల
ప్రీతి కొరకు తర్పణము గావించవలయును. దేవతలకు వారి నామ మంత్రములు
ఉచ్చరించుచు, దేవ తీర్ధము ద్వారా తర్పణము చేయ వలెను. వారి నామములకు "స్వాహా" చేర్చి తర్పణము లీయవలెను. (అగ్ని పురాణము, బ్రహ్మ పురాణము, మంత్ర మహోదధి నుంచి సేకరించ బడినది)
శ్రీచక్రార్చన యందు తర్పణము
శ్రీచక్రార్చన యందు తర్పణము అనేది చాలా విశిష్ట మైనది. చాలా ప్రత్యేకముగా ఈ విధిని చేస్తారు. ఎందుకంటే శ్రీ మాత "బిందు తర్పణ సంతుష్టాయై నమః" కాబట్టి. శక్తి బిందువు, శివుడు నాదము.
శ్రీ చక్రములోని అగ్ర భాగమును బిందువు అని అందురు. ఆ బిందువులో
జగన్మాత కామేశ్వరీ రూపములో నివసిస్తూ వుంటుంది. అందువలన శ్రీ చక్రార్చనలో మూల మంత్రముతో బిందువు పైన మరియు ఆవరణ దేవతలకు " శ్రీ పాదుకాం పూజయామి, తర్పయామి నమః "..... అని అంటూ అమృతము తో తర్పణము చేస్తారు.
ఎడమ చేతితో, చిన్ముద్ర తో, అమృతము తో తర్పయామి అంటూ తర్పణము చేయ వలెను.
కుడి చేతి తో జ్ఞాన ముద్ర తో, అక్షింతలు తో పూజయామి అంటూ పూజ చేయవలెను.
శ్రీచక్రార్చన ముద్రలతో, మంత్రములతో, యంత్రములతో , పాత్రా సాధనాలతో విశేషముగా కల్పోక్త ప్రకారముగా, వైదికముగా చేయబడుతుంది. దీనినె శ్రీ యాగానుక్రమానిక, రహోయాగం అని అందురు. షట్చక్రములకు ప్రతీకగా షట్పాత్ర లతో పాత్రా సాధనము
గావించి, శ్రీ చక్రార్చన చేయుదురు.
అమృతము
గోరు వెచ్చని ఆవు పాలల్లో దర్భలు, పుష్పము, యవలు, తెల్ల నువ్వులు, తెల్ల ఆవాలు, గంధము, గరిక, అక్షతలు, పచ్చ కర్పూరము, పంచదార, కుంకుమ పువ్వు, కస్తూరి, జాజికాయ, జాపత్రి, ఏలకులు, లవంగాలు మొదలగు సుగంధ ద్రవ్యములు
వేసి, గాలినీ ముద్రతో దోషములను వడ గట్టి, గరుడ ముద్ర తో దోషములను హరించి, ధేను ముద్రతో అమృతీకరణము గావించవలెను.
పిదప అమృతేశ్వరిని ఆ పాలల్లోకి ఆహ్వానము చేయ వలెను. అమృత మంత్రముతో అభి మంత్రించవలెను. పిదప అగ్ని కళ, సూర్య కళ, సోమ కళ, బ్రహ్మ కళ, విష్ణు కళ, రుద్ర కళ, ఈశ్వర కళ, సదాశివ కళ, శక్తి కళ, శాంతి కళ, మొదలగు 64 అమృత కళలను వేద మంత్రములతో, ప్రాణ ప్రతిష్టా మంత్రములతో ఈ
అమృతములోకి ఆహ్వానము చేయవలెను. ఈ విధముగా ఆవు పాలు సుగంధ
ద్రవ్యములతో, మంత్రములతో, అమృత కళలతో అమృతీకరణము గావించ బడి
అమృతము అయినది. దీనిని సుదర్శన మంత్రముతో రక్ష గావించ వలయును.
ఈ అమృతముతో శ్రీచక్రము లోని యోగినీ దేవతలను, బిందువులోని కామకామేశ్వరిని ఆహ్వానించి, పూజించి తర్పణము గావించెదరు.
...... కామేశ్వరీ నిత్యా -- శ్రీ పాదుకా౦ పూజయామి - తర్పయామి నమః
తంత్రము :- తంత్రము అంటే క్రియా కల్పము, పూజా విధానము. (Procedure / course of
action/method)
యంత్రము :- తద్దేవత యొక్క రేఖా చిత్రము. (Graphical view)
మంత్రము:- తద్దేవత యొక్క బీజాక్షరములు, దేవతను ఆకర్షించి, బంధించి వశము చేసుకొనే శక్తి. (Power)
ముద్రలు :- సంజ్ఞలు, గుర్తులు, ఒక క్రియకు సంజ్ఞా రూపము. (code/symbols/signals)
గురువుల వద్ద మాత్రమే నేర్చుకొని ఇది చేయవలయును, లేనిచో ప్రమాదములు కలుగును...
మీ
భాస్కరానంద నాధ
(కామరాజుగడ్డ రామచంద్రరావు)
10-06-2012
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.