నిత్యపవిత్ర వస్తువులు
సాలగ్రామములు,
బంగారము, నెయ్యి, నూతన వస్త్రములు, పుస్తకములు, మణులు నిత్య పవిత్రత గల
వస్తువులు. నెయ్యివేసి అభి ఘారముచేసిన అన్నము పవిత్ర మగును.
గోధుమధాన్యము,
యవలు, గో క్షీరములు పంచగవ్యము
పవిత్రములైనవి. పువ్వులు, పప్పులు, ధాన్యములు
గృహొప కరణములైన పాత్రలు మున్నగునవి నీళ్ళు జల్లినచో శుద్దయగును.
పట్టుబట్టలు నార చీరలు, వేడి నీళ్ళు
చల్లినచో శుద్ద యగును. వేదాధ్యయనము
చేసిన బ్రాహ్మణుడును అగ్నియు నిత్య పవిత్రులు. వ్రతదీక్షలో నున్న
వాడును,
సన్న్యాసియు నిత్య పవిత్రులు.
1. అరిష్టములు
తన నీడయు కనబడనివాడు సంవత్సరములోపల
మరణించును;
సూర్యునియందును, అగ్నియందును కిరణములున్నట్లు కనిపించనిచో పదునొక్కండు
నెలలు బ్రతుకును. కలలో తాను మలమూత్రములు విడిచినట్లుగాని వాంతి
చేసికొన్నట్లు గాని కనిపించిన పది నెలలు బ్రతుకును. కలలో శవమును గాని
పిశాచములను గాని చూచినచో తొమ్మిది నెలలు జీవించును. కారణములేక
లావైనట్లుగాని కలలో కనిపించినను, బుద్ది మాంద్యము కలిగినను సప్త మాసములలో
పల మరణించును. అరుంధతీ నక్షత్రమును చూడలేక పోయినను గ్రద్ద, కాకి, గ్రుడ్లు
గూబయు తలమీద తన్నినను ఆరునెలలో మరణించును. తన దేహమునీడలో శిరస్సు కనబడనిచో మూడునెలలో మరణించును.
తన శరీరము కంపుకొట్టినను, స్నానము చేసిన వెంటనే శరీరమున తడి కనబడ కుండినను,
ఎలుగు, గాడిద, కోతి, దున్నపోతు వీనిపై నెక్కి దక్షిణాభి ముఖముగా పోవుచున్నట్లు కలవచ్చినను, తల విరయబోసి కొన్న స్త్రీ యేడ్చుచు కలలో కనబడినను, చెవులు మూసి కొన్నప్పుడు ప్రాణఘోషము (గుంయ్యిమను శబ్దము) వినబడక పోయినను, ముక్కువాసనను, నాలుక రుచిని గ్రహించలేక పోయినను త్వరలో మరణము కలుగునని తెలిసికొని బుద్దిమంతుడైన వాడు భగవంతునియందె ధ్యానము నుంచి జ్ఞానియై సౌఖ్యమును పొందుటకు ప్రయత్నించవలెను.

సూర్యోపాసన వలన పలితములు:-
సూర్యుడు జగత్తులకే కన్నువంటివాడు. అయన బ్రహ్మ
విష్ణు మహేశ్వర స్వరూపుడు. ఉదయకాలమందు
బ్రహ్మ స్వరూపుడు. మధ్యాహ్నకాలమందు రుద్ర స్వరూపుడు. సాయంకాలమున విష్ణు స్వరూపుడ నియు చెప్పబడును.
వేదములందును ఈయన మహిమలు ఇట్లు వర్ణింపబడినవి.
సూర్యుడు వేదమయుడు. పాత్రఃకాలమున ఋగ్వేదమునందు వెలుగొందు చుండును. మధ్యాహ్నమున యజుర్వేదమున
ప్రకాశించును. సాయంకాలమునందు సామ వెదమున దీపించును. త్రికాలము లందును ఏ క్షణము గూడ వేదములు అనుసరించకుండ
సూర్యుడు సంచరించడు.
సూర్యునారాధించు వారికి హృద్రోగములు (గుండెజబ్బులు) ఉండవు. హరిమ (పచ్చ కామెర్లు) అను వ్యాధి రాదు. నేత్ర రోగములుండవు. (పూర్వము మయూరుడను మహాకవి, అంధుడై తనకు దృష్టి కలుగుటకు సూర్యుని ఆరాధించి ఆయన పై నూరు శ్లోకములు చెప్పి, ఆయన అనుగ్రహము చేత దృష్టిని సంపాదించెను. ఉదర సంబంధము లైన రోగములుగాని, మహావాత, మేహరోగములుగాని సూర్యు నారాధించెడి వారికి రావు. ఒక వేళ అట్టి రోగములున్నవారు సూర్యారాధనము చేసినచో ఆరోగములు శాంతించి దేహారోగ్యము కలుగును. ఋగ్వేద మందలి మహాసౌరము, యజుర్వేద మందలి అరుణము ఈ రెండింటితో పాటు త్రిచ విధానముగా సూర్య నమస్కారములు చేసినచో లేదా చేయించుకొన్నచో సమస్త వ్యాధులును నశించి ఆరోగ్య వంతులగుదురు.

No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.