Sunday 10 June 2012

శ్రీచక్రము-శ్రీవిద్య-5 (SRIVIDYA - SRI CHAKRAM)


శ్రీచక్రము-శ్రీవిద్య – 5 (SRIVIDYA - SRI CHAKRAM)

శివ చక్రములు నాలుగింటితోనూ, శక్తి చక్రములయిదింటి తోనూ చేరి శివశక్త్యాత్మకమైన శ్రీచక్రము
శివాశివుల శరీరమై, వారి ప్రతి రూపమై ఉన్నదని తెలియవలెను. శివశక్తుల సమ్మేళనమే శ్రీచక్రము.
శ్రీచక్రమును గురించి శ్రీ శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చాలా చక్కగా వివరించి యున్నారు.
శ్రీచక్రము-శ్రీవిద్య గురించి తెలుసుకోవాలంటే సాధకులు తప్పనిసరిగా  సౌందర్యలహరిని తీవ్ర జిజ్ఞాసతో
చదువవలెను.  సౌందర్యలహరి మొత్తము శ్రీవిద్యా సూత్రములతో, మంత్రములతో నిండివున్నది.  

శ్రీచక్రము నందు సృష్టికి  మూల కారణమైన మూల ప్రకృతులను పేరుగల తొమ్మిది త్రికోణములు గలవు.
శ్రీచక్రమునందు 44 కోణములు, 28 మర్మ స్థానములు,  24 సంధులు గలవు.   తొమ్మిది త్రికోణములు
గలవు గనుక నవయోన్యాత్మక మందురు. ఈ నవ యోనులు నవ ధాతువులై సృష్టి మూలకము లగుచున్నవి. త్వక్కు, రుధిరము, మాంసము, మేధస్సు, ఆస్థి అనునవి 5 శక్తి మూలకములు,  ధాతువులు.  మజ్జ,  శుక్రము, ప్రాణము, జీవుడు అను 4 ధాతువులు శివ మూలకములు.

మన దేహము నవ ధాతుమయము, నవ యోని సముద్భవము. దశమ యోని బైన్ధవ స్థానము.
ఇట్లు పిండాండము, బ్రహ్మాండము వీని వలన జనించినది. పంచ మహా భూతములు, పంచ తన్మాత్రలు,
పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్తత్వము, మాయ, శుద్దవిద్య, మహేశ్వరుడు, సదాశివుడు, అను పంచ వింశతి తత్వములు శ్రీచక్రమునందంతర్భూతములై యున్నవి.
శివశక్త్యాత్మకమైన శ్రీచక్రము చరాచర జగత్తునకు సృష్టికి మూలమై యున్నది.

అంతర్ముఖమున షట్చక్ర భేదనముచే శ్రీచక్రోపాసన చేసే శ్రీదేవీ భక్తులకు అణిమాది అష్ట సిద్దులు అతి సునాయాసముగా సిద్ధించును. సిద్ధించే ముందు పరీక్షలు చాలా తీవ్రముగా వుండును. మానసిక, శారీరిక పరీక్షలు వుండును. ఎన్నో రకముల భ్రమలు గల్పించబడును. కంటి ముందు మెరుపు తీగలు మెరియును. చెవులు హోరేత్తును. తల పగలి పోవునట్లుగా వుండును. భరించలేని మాడు పోటు, తల గిర్రున తిరుగును. ఒకే సమయములో శీతోష్ణస్థితులు గలుగును. వున్నది లేనట్టుగా లేనిది వున్నట్టుగా అగుపించును. రకరకాల మాయలు గనిపించును. మనస్సు తీవ్ర భయాందోళనలకు లోనగును. శరీరము తీవ్ర కంపనములకు లోను అగును. శరీరము చెమట పట్టును. వెన్నులోని నాడులు తీవ్రముగా స్పందించును. తరువాత శరీరము నెమ్మదిగా తేలిక అగును. నాగ బంధములో కదలిక గల్గును.
మూలాధారములో శక్తి చలనము, ఉత్కీలనము, ఆ తరువాత షట్చక్ర భేదనము.
ఆజ్ఞాచక్రములో త్రికోణ దర్శనము, త్రికోణా౦తర దీపికా దర్శనము కలుగును.
 ఆ తరువాత ఆనందమే బ్రహ్మానందం. ఇక మిగతా విషయములు చెప్పకూడదు.
 అతి రహస్యములు. స్వయముగా ఎవరికి వారు అనుభవించి తెలుసుకోవాలి. మొదట సారి మాత్రమే ఈ సాదృశ్యములు అగుపించును. ఆ తరువాత నీ మానసిక, శారీరిక స్థితిగతులను బట్టి, నీకు తెలియకుండానే కుండలినీశక్తి సహస్రారము వరకు గమనము చేయుచూ వుండును. రహస్యమైన విషయమేమంటే సాధకుడు అఖండ బ్రహ్మచర్య నిష్ఠలో, పంచదశీ మంత్ర పునఃశ్చరణ దీక్షలో  వుండవలెను. అప్పుడే ఇది సాధించగలడు. లేనిచో ఇది కుదరదు. గురు ముఖతః దీక్ష తీసుకొన్నవారిలో మాత్రమే ఈ సిద్ధి కలుగును. ఇతరులు ఈ సాధన చేయకూడదు. చాలా తీవ్ర పరిమాణాలు వుంటాయి.
ఎవరికి వారు తమ్ము తాము ఉద్దరించుకోవడానికి మాత్రమే ఈ సాధన చేయవలెను. అన్యధా తగు మూల్యము చెల్లించుకోక తప్పదు. శ్రీవిద్య మోక్ష సాధనకు మాత్రమే అని గుర్తెరున్గవవలెను.
సాధకుడు అమ్మ పెట్టె పరీక్షలకు నిలబడాలి. సాధన తీవ్రముగా వుండాలి. మధ్యలో చలించగూడదు. ఏకోన్ముఖులై వుండాలి. ఎవరికి ఏయే బలహీనతలు గలవో, అవే పరీక్షలకు తావుగా నిలబడును. మెట్టు మెట్టుకూ చిత్ర విచిత్రమైన పరీక్షలు కల్గును. శ్రీశైల మహాపుణ్య క్షేత్రములో  గలిగిన నా స్వీయ అనుభవములు ఇవి. మా గురువు గారు బ్రహ్మశ్రీ వేమూరి లక్ష్మీనారాయణ గారి అనుగ్రహముతో, వారు ఇచ్చిన పూర్ణ దీక్షతో, ఆ పరదేవత కృపతో  సాధించిన సాధనా రహస్యములు ఇవి. ఇప్పటి వరకు ఎవ్వరికీ దెలుపలేదు. 12 సం. తరువాత ఈ రోజు మీ ముందు వుంచుతున్నాను.  సాధకుల సౌకర్యము కోరకు.

షట్చక్రములు దేవతలు
మూలాధారము, స్వాధిష్ఠానము, మణిపూరము, అనాహతము, విశుద్దము, ఆజ్ఞాచక్రము అని ఆరు చక్రములు మన దేహమునందు గలవు. అన్నింటికీ పై నుండునది సహస్రారము. దీనిని సహస్రదళ పద్మమందురు. 
మూలాధారము  పృధ్వీతత్త్వము,  స్వాధిష్ఠానము అగ్నితత్త్వము, మణిపూరము ఉదకతత్త్వము,
అనాహతము వాయుతత్త్వము, విశుద్ధము ఆకాశతత్త్వము, ఆజ్ఞా చక్రము మనస్తత్త్వము.
మూలాధార స్వాధిష్ఠానములు - అగ్ని మండలము - రుద్రగ్రంధి,
మణిపూరానాహతములు   -  సూర్య మండలము విష్ణు గ్రంధి.
విశుద్ధాజ్ఞా చక్రములు  -      చంద్ర మండలము  -  బ్రహ్మ గ్రంధి.
మానవ శరీరంలోని షట్చక్రములకు బిందువు అని, శ్రీచక్రమునకు నాదము అని, ఈ రెంటి ఐక్యతను
నాదబిందు ఐక్యతఅని అందురు. శరీరములో వుండే షట్చక్రములకు, సంస్కృత భాషకు వున్న యాభై అక్షరములతోనూ, షోడశ కళలతోనూ, శ్రీచక్రముతోనూ, మూల మన్త్రముతోనూ ఐక్యము చెందుతున్నాయి.
   నుంచి  అః  వరకు గల పదహారు అచ్చులు   చంద్ర ఖండము”.
   నుంచి     వరకు గల ఇరువది నాలుగును  సౌర ఖండము”.
  నుంచి  క్ష   వరకు గల పదియును          అగ్ని ఖండము”. ... అని అందురు.
ఈ విధముగా   నుంచి క్ష  వరకు గల వర్ణములను  అ-క్షరములు ... అని అందురు.
నాశనము లేనటువంటివి గాన అక్షరములు... అని అందురు.

నమస్కారములతో
మీ
భాస్కరానందనాథ
23-2-2012.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.