Sunday, 10 June 2012

స్వగతం


 స్వగతం
అయ్యా అందరికీ నమస్కారములు,
ఇందుమూలంగా యావన్మందికీ తెలియజేయడమేమనగా,
శ్రీ శృంగేరీ శ్రీ విరూపాక్ష శ్రీ పీఠాధీశ్వర   శ్రీవిద్యాశంకర పదమావేశ ప్రకాశిత
శ్రీ జగద్గురు శ్రీ శ్రీ శ్రీ కల్యాణానంద భారతీ మహాస్వామి (శ్రీ విద్యారణ్యుల వారి అవిచ్చిన్న గురుపరంపరలో 42వ జగద్గురు) వారు మా పరమేష్టి  గురువులు. కావున నేను శ్రీ శృంగేరీ శంకరాచార్య సాంప్రదాయములోని వాడను. నమ్మినవాడను. ఆ పరంపరలో శ్రీవిద్యా పూర్ణ దీక్ష తీసుకున్నవాడను నేను.   ఆరువేల నియోగి బ్రాహ్మణుడను, స్మార్తులము మేము. సకల దేవతారాధనే మా మతము. శివునికి విష్ణువుకి అభేదము అని గాఢముగా, ధృఢముగా నమ్మే వాళ్ళము మేము.

జగద్గురువులు శ్రీ శంకరాచార్య భగవత్పాదులు మాకు గురువరేణ్యులు. ఆదిగురువులు. వారి మాటలు మాకు శిరోధార్యము. వారి మాటలను, వారి సిద్దాంతములను, వారి అడుగుజాడలలో నడవడము నా ప్రధమ కర్తవ్యము అయివున్నది. మరి తత్సమయమున ఇతర మత సంభంధములను గురించి గాని, వారి అభిప్రాయములను గురించిగాని , వారి సిద్ధాంతములనుగాని  అధిక్షేపించుట నా అభిమతము గాదని  విన్నవించుకోవడమైనది. . ఎవ్వరినీ ఇబ్బంది పెట్టాలని చేస్తున్న ప్రయత్నము కాదిది.

నాకు తెలిసిన, నేర్చుకున్న విషయములను పదిమందితో పంచుకోవాలన్న సత్ సంకల్పముతో చేస్తున్న పని ఇది. ఎవరి మీదా రుద్దాలని కాదు నా ఉద్దేశ్యము. శ్రీవిద్యావ్యాప్తి కొరకు నా వంతు సహాయమును చేస్తున్నాను. జగములకు తల్లి అయిన ఆ శ్రీమాతను గురించి నాలుగు మాటలు చెబుతున్నాను.
ఇష్టము వున్నవాళ్ళు స్వీకరించ వచ్చును, ఇష్టము లేని వాళ్ళు త్రుణీకరించనూ వచ్చును. ఎవరి అభిమతము వారిది.  దీనిలో ఎటువంటి బలవంతపు మాఘ స్నానములూ లేవు ఎవరికీ.
నేను ఎవరినీ నిందించుట లేదు సరి గదా. పరుష వాఖ్యములతో ఎవరినీ నొప్పించుట  కూడా లేదు!


మీ
భాస్కరానందనాధ
రామచంద్రరావు కామరాజుగడ్డ