Tuesday 19 June 2012

పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి,


పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి,


తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు ఈ మధ్యన చాలా మంది.  బ్రాహ్మణులు దొరకడము లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడి తో చేసే వాళ్ళు లేరు అని, వంట వాళ్ళు దొరకడము లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని.... ఇలా రకరకాల కారణములతో తద్దినములు పెట్టడము మానేస్తున్నారు. ఇది తప్పు. వంశాభివృద్ధి జరగదు. ఇది నిజము. పిల్లలు పుట్టరు, పుట్టినా ఆడ పిల్లలే పుడతారు. మగ పిల్లలు పుట్టరు. ఇది నిజము. నిజము. నిజము. నిజము. నమ్మండి. అందరికీ చెప్పండి. వంశములను కాపాడండి.
పితృ దేవతలు సంతోష పడక పోతే వంశాభివృద్ధి జరగదు. మగ పిల్లలు పుట్టరు. వంశము ఆగి పోతుంది.  అందరు తెలుసుకొని, జాగ్రత్తగా, పద్ధతిగా, శాస్త్ర ప్రకారముగా విధిగా ఆచరించాలి. దీని మడి వేరు. తడి బట్ట తోనే వంట చేసి,  బ్రాహ్మణులకు భోజనము వడ్డించాలి. పొడి బట్ట పనికి రాదు. ముందు రోజు రాత్రి, ఆ రోజు రాత్రి భోజనము చేయకూడదు, బ్రహ్మ చర్యము పాటించి నేల మీద భార్యా భర్తలు పరుండాలి, భక్తితో, శ్రద్ధతో శ్రాద్ధము పెట్టాలి. ఇంటి కోడలు వంట చేస్తే పితృ దేవతలు శ్రీఘ్రముగా అనుగ్రహిస్తారు.
పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి, మన వంశాన్ని కాపాడేది వాళ్ళే. వాయనము ఇస్తాము, కూరలు ఇస్తాము, బియ్యము ఇస్తాము అని అంటే కుదరదు. మీరు వుండే ఇంట్లో పెడితేనే చాలా మంచిది.
దేవతలకు చేసే కార్యము కాని, పితృ దేవతలకు చేసే కార్యము కాని రెండూ మీరు వున్న ఇంట్లోనే చేయాలి, అలా  చేస్తే అది మీకు మీ ఇంటికి మంచిది.

మీ
భాస్కరానందనాధ

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.